శుభవార్త: విజయవాడ నుండి సింగపూర్ కు విహంగయానం.. లైన్ క్లియర్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులతో పాటు, సింగపూర్ లో ఉన్న ప్రవాసాంద్రులు సంతోషపడే శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఎంతో కాలంగా వేచి చూస్తున్న సింగపూర్ విజయవాడ అంతర్జాతీయ విమాన సర్వీసు పునః ప్రారంభం అవుతున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. విజయవాడ సింగపూర్ మధ్య ప్రత్యక్ష విమాన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం పైన సంతకం చేసింది.
ఏపీ, సింగపూర్ ల మధ్య ప్రత్యక్ష విమాన ఒప్పందం
నిన్న జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో సింగపూర్ హోంమంత్రి మరియు న్యాయమంత్రి కె. షణ్ముగం మరియు సింగపూర్ విదేశాంగమంత్రి గన్ సియో హువాంగ్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడి ఏపీ మరియు సింగపూర్ ల మధ్య విమాన ఒప్పందం పైన సంతకం చేశారు. దీనిని సాధ్యం చేయడంలో మద్దతు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ విమాన సర్వీస్ తో టూరిజం అభివృద్ధి
ఇదిలా ఉంటే ఈ విమాన సర్వీసు వల్ల తెలుగు ప్రజలకు సింగపూర్ తో మంచి సంబంధాలు ఏర్పడతాయని, టూరిజం అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని ఏపీ బస్సులతో పాటు సింగపూర్ లో ఉన్న ప్రవాసాంద్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా విజయవాడ సింగపూర్ విమానాలు నడవడం వల్ల ప్రయాణ సమయంలో తగ్గుతుందని ఆడవారి మాటలకు టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
చంద్రబాబు సింగపూర్ పర్యటన సమయంలో విజ్ఞప్తి
అయితే గత జూలైలో ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సందర్భంగా సిబీఎన్ తెలుగు డయస్పోరా మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లో పాల్గొన్నారు. అప్పుడు ఏపీ ఎన్నార్టీ తరఫున సింగపూర్ తెలుగు డయాస్పోరా చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ విషయంలో చాలా చొరవ తీసుకున్నారు.
వంద రోజుల్లోనే విమాన సర్వీసులను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో వివిధ మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసి వంద రోజుల్లోనే విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్‌కు ఇండిగో సర్వీసులు ప్రారంభమయ్యాయి. గతంలో తగినంత మంది ప్రయాణికులు లేరని వైసిపి హయాంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత సర్వీసులు ఇండిగో సంస్థ ప్రారంభించింది. వయబులిటీ ఫండింగ్ లేకుండా వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు నడపనున్నారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications