ఏపీలోని ఆ ఊరి ప్రజలను భయపెడుతున్న చెరువు, పంట పొలాలు!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం అయినవిల్లి లంక ప్రజలు ప్రస్తుతం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఆ ఊరి చెరువుని చూసి ఆందోళన చెందుతున్నారు. పొలానికి వెళ్ళాలంటే ఆందోళన చెందుతున్నారు. పశువులను, తమను కాపాడుకోవడానికి ఏం చేయాలి అని తెగ ఆలోచిస్తున్నారు. ఇటు అధికారులు సైతం ఆ ఊరి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
గ్రామంలో రెండు మొసళ్ళు ప్రత్యక్షం
అసలు ఇంతకీ ఆ ఊర్లో ఏం జరిగింది? ఆ ఊరి చెరువు గురించి జనాలంతా ఎందుకు భయపడుతున్నారు? అనే వివరాలలోకి వెళితే. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి లంక గ్రామంలో ఉన్న ఊరి చెరువులో రెండు మొసళ్ళు ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ రాత్రికి రాత్రి ఆ సమీప పొలాల నుండి చెరువులోకి చేరాయి.

పంట పొలాలు, చెరువులో తిరుగుతున్న మొసళ్ళు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన క్రమంలో ఈ వర్షాలకు వాగులు వంకలు నదులు పొంగి ప్రవహించాయి. అనేక ప్రాంతాలలో వరద ఉధృతి చోటు చేసుకుంది. ఈ వరద ప్రవాహం లోనే ఈ రెండు ముసలి కొట్టుకు వచ్చి అయినవిల్లి లంకలోని పంట పొలాల్లోకి చేరినట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇవి అక్కడే సంచరిస్తున్నాయి.
మొసళ్ళ జాడ కనిపెట్టేందుకు రంగంలోకి అటవీశాఖ అధికారులు
లంక భూములలోని పంట పొలాలలో, అక్కడే ఉన్న చెరువులోనూ ఈ మొసళ్ళు తిరుగుతుండడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక రైతులు, వ్యవసాయ కూలీలు పంట పొలాలలో పనిచేయడానికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక ఈ ఘటన పైన సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. మొసళ్ళు జాడ కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
హెచ్చరిక బోర్డులు.. గ్రామస్తుల విజ్ఞప్తి
మొసళ్ళు సంచరిస్తున్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు వాటిని పట్టుకోవడానికి బోనాలు సిద్ధం చేయడంతో పాటు నీటిని బయటకు తోడే ఏర్పాట్లు కూడా చురుగ్గా చేస్తున్నారు. ఎవరైనా మొసళ్ళను చూసినట్లయితే వెంటనే సమాచారం అందించాలని వారు హెచ్చరికల బోర్డులు పెట్టారు. ఇక ఆ మొసళ్ళను పట్టుకునే వరకు అయినవిల్లి లంక గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు ఉండదు అన్న మాట వాస్తవం. మొసళ్ల కారణంగా ఎవరికి ఎటువంటి హాని జరగకూడదని, త్వరితగతిన అధికారులు వాటిని పట్టుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
అక్కడ వారం రోజులు చికెన్, మటన్, ఫిష్ షాపులు బంద్.. విక్రయిస్తే చర్యలే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications