ఇక వణుకుడే.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు !!
బాబోయ్ చలి అంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాధారణంగా డిసెంబర్ చివర్లో లేదా జనవరి ఆరంభంలో చలిగాలులు ఎక్కువగా వీస్తాయి. కానీ ఈసారి డిసెంబర్ నెల ప్రారంభం నుంచే గడ్డకట్టే స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. గత పదిరోజులుగా వీస్తున్న చలిగాలులకు ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. కాగా ఇప్పుడు వాతావరణ నిపుణులు ప్రజలకు అలర్ట్ ప్రకటిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోనున్నాయని.. ఊహకందని స్థాయిలో చలి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఏపీలో ఉష్ణోగ్రతలు తెలంగాణ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో చలి మరింత పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అరకు, ముంచంగిపుట్టు, చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు కుప్పకూలిపోయి చలి గజగజలాడిస్తోంది.

ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 18 నుండి 21 వరకు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు పీక్స్ కు చేరుకుంటాయని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో 7-9 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ప్రకటించారు. ఇలా చలి పీక్స్ కు చేరుకుని ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని తెలిపారు.
మరి ముఖ్యంగా రాబోయే నాలుగైదు రోజులు ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ప్రకటించింది. ఈ జిల్లాల్లో 5 నుండి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో 11 నుండి 20 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది.
మరోవైపు ఇప్పటికే చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పుడు చలి మరింత పెరిగే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు కంగారు పెడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే వెచ్చని దుస్తులు (స్వెట్టర్లు, మప్లర్లు) ధరించాలని కోరుతున్నారు. అలానే మార్కెట్లలో ఉన్ని స్వెటర్లు, షాల్లు, గ్లౌజులు, మంకీ క్యాప్‌ల డిమాండ్ భారీగా పెరిగింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications