నాటి మా కృషి ఫలితమే నేడు భోగాపురంలో- వారికి జగన్ అభినందనలు..!!
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం లాండ్ అయింది. భోగాపురం విమానా శ్రయాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు జీఎంఆర్ సంస్థ వెల్లడించింది. ఇక భోగాపురం ఎయిర్‌పోర్టును జూన్ 26వ తేదీన ప్రారంభించనున్నారు. తొలి విమానం లాండ్ అవ్వటం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. కీల కీలక అంశాలను ప్రస్తావించారు. అభినందనలు తెలిపారు.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయ వంతం కావడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానాశ్రయం అందు బాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. కాగా, తొలి విమానం లాండ్ కావటం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. కీలక అంశాలను ప్రస్తావిస్తూ.. తమ కృషిని వివరించారు. ఈ మేరకు చేసిన ట్వీట్ లో... "విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది... అని పేర్కొన్నారు.

దీనికి కొనసాగింపుగా.. "ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది..." అంటూ జగన్ వివరించారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications