జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్, మారుతున్న లెక్కలు..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ పూర్తిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. పార్టీ నేతలు.. కేడర్ పైన కేసుల విషయంలో జగన్ తన వైఖరి తేల్చి చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు అక్రమంగా కేసు లు పెట్టిన వారిని వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. కాగా.. రాజకీయంగా జగన్ నిర్ణయాలు అంతు చిక్కటం లేదు. ఏడాది కాలంగా వస్తున్న మంచి అవకాశాలను జగన్ మిస్ చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ తాజా నిర్ణయాల పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.
మాజీ సీఎం జగన్ వ్యూహాల్లో లోపం కనిపిస్తోందా. 2014 ఎన్నికల్లో ఓడిన తరువాత కనిపించిన జగన్.. 2024 లో ఓటమి తరువాత జగన్ శైలికి పోలిక లేదు. 2014 లో ఓడిన తరువాత తిరిగి ఎలాగైనా గెలిచి సీఎం కావాలనే కసి.. పట్టుదల కనిపించాయి. పూర్తిగా పార్టీ నేతలకే సమయం కేటాయించారు. ప్రభుత్వ నిర్ణయాల పైనే గురి పెట్టేవారు. ప్రజా సమస్యల పైన దీక్షలు.. నిరసన లు.. పోరాటాలు చేసారు.

ఆ తరువాత సుదీర్ఘ పాదయాత్రతో జనంతో మమేకం అయ్యారు. ఫలితం 2019 ఎన్నికల్లో 151 సీట్లతో సీఎం అయ్యారు. నాటి రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. కాగా, 2024 ఎన్నికల ఫలితాల తరువాత జగన్ వారంలో మూడు రోజులు తాడేపల్లి.. మిగిలిన రోజులు బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. ప్రతిపక్ష హోదా కూటమి నేతలకు ఇచ్చే ఉద్దేశం లేదని తెలిసినా.. అదే కారణంతో అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు.
2014-17 కాలంలో అసెంబ్లీలో జగన్ ప్రసంగాలు చూసిన వారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్ణయాల పైనా అదే తరహాలో అసెంబ్లీలో స్పందించాలని కోరుకున్నారు. అయితే, జగన్ సభకు దూరంగా ఉంటున్నారు. తనకు సమయం ఇచ్చినా.. ఇవ్వకున్నా సభలోనే తన నిరసన తెలిపే హక్కు ఉన్నా అందుకు సుముఖంగా లేరు. తాను చెప్పదలచుకున్నది గంటల కొద్ది మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వివరిస్తున్నారు.

అవి ఎంత వరకు ప్రజల్లోకి వెళ్తున్నాయనేది పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. ఈ ఏడాది సంక్రాంతి నుంచి కేడర్ వద్దకు వెళ్లి.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు రోజులు ఉంటానని జగన్ ప్రకటించారు. మళ్లీ సంక్రాంతి వస్తున్నా.. ఇప్పటికీ అమలు కాలేదు. జగన్ ఏ ప్రత్యక్ష పోరాటంలోనూ పాల్గొన లేదు. కొంత మంది నేతలను జైలు పరామర్శలకు పరిమితం అయ్యారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను పరామర్శించారు.
తన పార్టీ నేతలు, కేడర్ పైన కేసులు పెడుతున్న అంశం పైన మాత్రం తన మార్క్ స్పందన ఏంటో చూపించారు. కూటమి నేతలు మూకుమ్మడిగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఆ స్థాయిలో కౌంటర్ చేసే వారు తగ్గిపోయారు. మెడికల్ కాలేజీల పైన పోరాటం మినహా ఈ 18 నెలల కాలంలో వైసీపీ చెప్పుకునే స్థాయిలో ఏం చేయలేదు. ఇప్పటికీ జగన్ ను పార్టీ నేతలు.. కేడర్ కలవాలంటే అప్పాయింట్ మెంట్లు దొరకటం లేదు.

జగన్ ఎన్నికలు జరిగి 20 నెలలు అవుతున్నా.. పూర్తి స్థాయిలో ఏపీలో అందుబాటులో ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పటం మినహా.. ఆ వ్యతిరేకత తనకు అనుకూలంగా మలచుకునే ఆలోచనలో జగన్ వెనుకబడినట్లు విశ్లేషణలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతు న్న వేళ.. ఇప్పటికైనా జగన్ కార్యాచరణ.. వ్యూహాల్లో మార్పు వస్తుందా.. ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రమే నమ్ముకొని ఉంటారా అనేది కేడర్ ఆసక్తిగా గమనిస్తోంది. మరి.. జగన్ ఏం చేస్తారో 2026 లో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో వేచి చూడాలి.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications