ఎన్టీఆర్, బాబు బాటలో జగన్: విపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ జరగనుంది. గతంలో చంద్రబాబునాయుడు పాదయాత్ర చేసిన సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హజరయ్యారు. ఎన్టీఆర్ మాత్రం 1989 నుండి 1994 వరకు అసెంబ్లీకి హజరుకాలేదు. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాకే అసెంబ్లీలో అడుగుపెట్టారు.

  అసెంబ్లీలో టిడిపి వ్యూహం : వైసీపీ నేతల గురించి మాట్లాడకూడదని ఇలా...! | Oneindia Telugu

  టార్గెట్ 2019: బిజెపి ప్లాన్ ఇదే, టిడిపి, వైసీపీలకు ఇబ్బందేనా?

  2012 అక్టోబర్ 2 వ, తేదిన చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించారు. చంద్రబాబునాయుడు పాదయాత్ర నిర్వహించే సమయంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు.

  జగన్‌కు కౌంటర్: వ్యక్తిగతంగా తిట్టడం సంస్కారం కాదు: బాబు

  ప్రస్తుతం వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర సాగుతున్న సందర్భంలో జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హజరుకాలేరు. అయితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ అసెంబ్లీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకొంది.

  జగన్ పాదయాత్ర: చరిత్ర సృష్టిస్తారా, బాబుకు ఇబ్బందేనా?

  ఎన్టీఆర్, బాబు బాటలోనే జగన్

  ఎన్టీఆర్, బాబు బాటలోనే జగన్

  1989లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకొన్నారు. ఈ విషయమై ఆనాడు ప్రకటించారు. అసెంబ్లీ వెలుపల టిడిపి తన ఆందోళనలు కొనసాగించింది. అయితే 2012లో పాదయాత్రలో చంద్రబాబునాయుడు ఉన్న సమయంలో కూడ ఆయన అసెంబ్లీకి హజరుకాలేదు. కానీ, పాదయాత్ర ముగిసిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబునాయుడు హజరయ్యారు. బాబు పాదయాత్రలో ఉన్న సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు హజరయ్యారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచాలనే నిర్ణయం తీసుకోవడాన్ని నిర్ణయాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ నుండి ర్యాలీగా వెళ్ళి ఎమ్మెల్యే క్వార్టర్‌లో నిరహరదీక్షకు కూడ దిగారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని నిరసన వ్యక్తం చేస్తూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలనేది తమకు ఎన్టీఆర్ ఆదర్శమని కూడ వైసీపీ నేతలు ప్రకటించారు.

   ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ

  ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ

  నవంబర్ 9వ, తేది నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. దీంతో వైసీపీ లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ఈ దఫా జరగనున్నాయి. టిడిపి, బిజెపిలు మాత్రమే సభలో ఉంటాయి. ఈ రెండు మిత్రపక్షాలే. దీంతో విపక్షం లేకుండానే సభ జరగనుంది.

   సంప్రదాయాల ప్రకారమే సభ నిర్వహణ

  సంప్రదాయాల ప్రకారమే సభ నిర్వహణ

  సంప్రదాయాల ప్రకారంగానే సభ నిర్వహించనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని సీఎం అన్నారు. సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నారు.ఉండవల్లి అరుణ్‌కుమార్ మాత్రం వైసీపీ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

   టిడిఎల్పీ సమావేశం

  టిడిఎల్పీ సమావేశం

  అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై టిడిఎల్పీ సమావేశంలో చర్చించనున్నారు. నవంబర్‌ 9న, మధ్యాహ్నం టిడిఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.అంతేకాదు సుమారు 28 అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని టిడిఎల్పీ భావిస్తోంది. వైసీపీ సభకు రాకపోతే ఏం చేయాలనే అంశాలపై కూడ చర్చించనుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The winter sesssion ofthe AP Assembly is set to begin in the second week of November.The opposition YSRCP has taken a decisssion to boycott the winter session. demanding the disqualification of the MLAs who defected from their party to the ruling party.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి