• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను -ఇంటర్‌పోల్ దర్యాప్తు -ఎస్ఈసీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థ ఎన్నికలు ప్రశాతంగా, విజయవంతంగా జరిగినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ సర్కారుకు మధ్య విభేదాలు, వివాదాలు మత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రుల గౌరవానికి భంగం కలిగించేలా లేఖలు రాశారంటూ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డకు నోటీసులివ్వగా, అసలా లేఖలు బయటికెలా లీక్ అయ్యాయో తేల్చండంటూ ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ను అమెరికా 200ఏళ్లు పాలించింది -మోదీ వల్లే గెలిచాం -20మంది పిల్లల్ని కనొచ్చుగా: ఉత్తరాఖండ్ సీఎం మళ్లీభారత్‌ను అమెరికా 200ఏళ్లు పాలించింది -మోదీ వల్లే గెలిచాం -20మంది పిల్లల్ని కనొచ్చుగా: ఉత్తరాఖండ్ సీఎం మళ్లీ

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

ఎన్నికల కమిషనర్ హోదాలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి గవర్నర్‌కు తాను రాసిన లేఖల్లోని వివరాలు లీక్ అయ్యాయని, ప్రజా వినియోగానికి సంబంధంలేని సదరు లేఖలను సాధారణ ప్రజానీకానికి, మీడియాకు బహిర్గతం చేయడానికి వీల్లేకున్నా, కొందరు వ్యక్తులు తమ స్వార్ధ ప్రయోజనం కోసం వాటిని లీక్ చేశారని, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గత శనివారం(మార్చి 20న) హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దీనికి..

హైకోర్టు పరిధిలో ఉండగా..

హైకోర్టు పరిధిలో ఉండగా..

గవర్నర్ కు తాను రాసిన లేఖల్లోని అంశాల ఆధారంగానే మంత్రుల ప్రివిలేజ్ నోటీసులున్నాయన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. లీకైన లేఖలను జత చేస్తూ మెట్టు రామిరెడ్డి అనే వ్యక్తి పరిషత్‌ ఎన్నికల కోసం హైకోర్టులో మరో పిటిషన్ వేయడాన్ని ప్రస్తావించారు. సీఎం సహా మంత్రుల్లో కొందరు కులాన్ని కూడా ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనీ నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగా, వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ట్విటర్ వేదికగా నిమ్మగడ్డపై విమర్శలు గుప్పించారు.

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ

నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను

నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను

హైకోర్టులో ఎస్ఈసీ దాఖలు చేసిన ఫిర్యాదులో కులం అంశాన్ని కూడా చేర్చిన దరిమిలా, వైసీపీ ఎంపీ సాయిరెడ్డి మరోసారి దానిని ప్రస్తావిస్తూ.. ''పచ్చకుల బ్యాచ్‌కు నిమ్మగడ్డే తన లెటర్లను లీక్ చేస్తాడు''అని విమర్శించారు. మళ్లీ ఇదేదో జాతీయ సమస్య అన్నట్లు సీబీఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేశారని, ఏపీ పోలీసులైతే మళ్లీ తననే ఇరికిస్తారేమో అని నిమ్మగడ్డ జంకుతున్నారని, నిజానికి నిమ్మగడ్డ ఇంటర్ పోల్ లేదా స్కాట్ లాండ్ యార్డ్ పోలీసుల దర్యాప్తు కోరాల్సిందని సాయిరెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ చెత్త లేఖలు, సీక్రెట్ మీటింగ్ లపై చైనా హ్యాకర్ల కన్నుపడిందేమో అని వైసీపీ ఎంపీ రాసుకొచ్చారు.

English summary
ysrcp general secretary and mp vijayasai reddy once again slams andhra pradesh state election commissioner (ap sec) nimmagadda ramesh kumar. as sec seeks CBI probe into leak of letters to Governor, sai reddy allegges that nimmagadda himself leaked letters to favour tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X