పల్సర్ పుట్టిన రోజు. భారీ డిస్కౌంట్ పాటు ఫ్రీ సర్వీసింగ్!
భారతదేశంలో స్పోర్ట్స్ బైక్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చే పేరు బజాజ్ పల్సర్. ఒకప్పుడు మైలేజ్ బైక్‌లే ఎక్కువగా కనిపించిన ఇండియన్ మార్కెట్లో, పవర్ + స్టైల్ + స్పోర్టీ లుక్‌ను సామాన్య యువతకు పరిచయం చేసిన బ్రాండ్ పల్సర్. అందుకే ఇది కేవలం బైక్ మాత్రమే కాదు... ఒక యూత్ ఐకాన్గ్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే 25 వసంతంలోకి అడుగుపెట్టింది. పల్సర్ పుట్టిన రోజు సందర్భంగా అద్బుతమైన ఆఫర్ అందిస్తుంది బజాజ్.
డిజైన్ మ్యాటర్లో అయినా, ఇంజిన్ పెర్ఫార్మెన్స్లో అయినా, ఫీచర్ల విషయంలో అయినా... టైమ్ మారినప్పుడల్లా పల్సర్ కూడా అప్డేట్ అవుతూ వచ్చింది. కొత్త టెక్నాలజీ, అగ్రెసివ్ స్టైలింగ్, స్ట్రాంగ్ ఇంజిన్ ట్యూనింగ్‌తో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. అందుకే 25 ఏళ్లుగా ఇండియన్ రోడ్లపై పల్సర్ హవా తగ్గలేదు.ఇప్పుడు ఈ లెజెండరీ బ్రాండ్ తన 25 ఏళ్ల జర్నీని ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది. దీనిలో భాగంగా బజాజ్ ఆటో '25 ఇయర్స్ ఆఫ్ పల్సర్ సెలబ్రేషన్ ఆఫర్' ను ప్రకటించింది.
అన్ని బజాజ్ షోరూమ్‌లలో..
ఆఫర్లో భాగంగా పల్సర్ బైక్ పై రూ.7,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కేవలం డిస్కౌంట్ ఆఫర్ మాత్రమే కాదు... పల్సర్‌ను ఇష్టపడిన కోట్లాది యూజర్లకు ఇచ్చే థ్యాంక్యూ గిఫ్ట్‌లా చెప్పొచ్చు. ఈ స్పెషల్ ఆఫర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధికారిక బజాజ్ షోరూమ్‌లలో అందుబాటులో ఉంది. పల్సర్ కొనాలనుకుంటున్నవాళ్లకు ఇది బెస్ట్ టైమ్‌గా మారింది. 25 ఏళ్లుగా యూత్ హార్ట్‌బీట్‌గా ఉన్న పల్సర్, ఈ సెలబ్రేషన్ ఆఫర్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

పల్సర్ లైనప్‌లో బడ్జెట్ బైక్‌ల నుంచి పవర్ ప్యాక్ మోడళ్ల వరకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ కావాలంటే 125cc మోడల్ ఉంది. ఎక్కువ పవర్, లేటెస్ట్ ఫీచర్లు కావాలంటే పెద్ద ఇంజిన్ మోడళ్లూ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పల్సర్ రేంజ్ 125cc నుంచి 400cc వరకు విస్తరించి ఉంది. మొత్తం 11 డిఫరెంట్ మోడళ్లు ఉండటంతో, ప్రతి రైడర్‌కి సరిపోయే పల్సర్ ఒకటి తప్పకుండా దొరుకుతుంది. పల్సర్ 125 ఈ రేంజ్లో స్టార్టింగ్ మోడల్. స్పోర్టీ లుక్‌తో పాటు సరసమైన ధరలో పల్సర్ ఫీల్ ఇవ్వడం దీని ప్లస్ పాయింట్. ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునే యువతకు ఇది మంచి ఛాయిస్. దీని తర్వాత పల్సర్ N150, పల్సర్ 150, పల్సర్ N160 వంటి పాపులర్ మోడళ్లు యూత్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications