అదానీ గ్రూప్ బంపర్ ఆఫర్: ఇన్వెస్టర్లకు పండగే!
అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(ఏఈఎల్), రిటైల్ పెట్టుబడిదారుల కోసం తన మూడో పబ్లిక్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్(NCD) ఇష్యూను ప్రకటించింది. స్థిరమైన ఆదాయం, భద్రతను కోరుకునే ఇన్వెస్టర్ల కోసం రూపొందించిన ఈ పథకం పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఇష్యూ వివరాలు, ముఖ్యమైన తేదీలు
అదానీ ఎంటర్ప్రైజెస్ మూడో ఎన్సీడీ ఇష్యూ జనవరి 6, 2026న ప్రారంభమై.. జనవరి 19, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే గడువు కంటే ముందే సబ్స్క్రిప్షన్ పూర్తయితే ఇష్యూను ముందుగానే ముగించే అవకాశం కూడా ఉంది. ఈ ఇష్యూ బేస్ సైజు రూ.500 కోట్లు కాగా.. గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా మరో రూ.500 కోట్లు కలిపి మొత్తం రూ.1,000 కోట్ల వరకు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిబెంచర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) లలో లిస్ట్ చేయబడతాయి.

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, కాలపరిమితి
ఈ ఎన్సీడీల ద్వారా పెట్టుబడిదారులు ఏడాదికి గరిష్టంగా 8.90 శాతం వరకు రాబడిని పొందవచ్చు. ఇది ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల కంటే మెరుగ్గా ఉండటం విశేషం. ఇన్వెస్టర్లు తమ వెసులుబాటును బట్టి 24 నెలలు, 36 నెలలు లేదా 60 నెలల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. వడ్డీ చెల్లింపుల కోసం త్రైమాసిక, వార్షిక, క్యుములేటివ్ (గడువు ముగిశాక మొత్తం నగదు) వంటి ఎనిమిది రకాల సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి.
భద్రత, రేటింగ్స్
పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచేలా ఈ ఇష్యూకు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలైన CARE, ICRA 'AA- (Stable)' రేటింగ్‌ను ఇచ్చాయి. ఈ రేటింగ్ అంటే సదరు సంస్థ ఆర్థికంగా బలంగా ఉందని.. పెట్టుబడిదారుల అసలు, వడ్డీని సకాలంలో చెల్లించడంలో అధిక స్థాయి భద్రతను కలిగి ఉందని అర్థం. తక్కువ క్రెడిట్ రిస్క్ ఉన్న ఫిక్స్డ్ ఇన్కమ్ ఆప్షన్ల కోసం చూసేవారికి ఇది ఒక మంచి ఎంపిక.
పెట్టుబడి విధానం, నిధుల వినియోగం
సాధారణ రిటైల్ పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొనేలా కనీస పెట్టుబడి మొత్తాన్ని రూ. 10,000 (10 ఎన్సీడీలు) గా నిర్ణయించారు. ఆ పైన ప్రతి ఒక డిబెంచర్ (రూ. 1,000) చొప్పున ఎంతైనా పెంచుకోవచ్చు. ఈ ఇష్యూ ద్వారా సేకరించే నిధులలో 75శాతం మొత్తాన్ని కంపెనీ తన పాత రుణాల చెల్లింపులకు, వడ్డీ చెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన 25 శాతం నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తారు.
అదానీ ఎంటర్ప్రైజెస్ వృద్ధి, ప్రాజెక్టులు
ఇండియాలో మౌలిక సదుపాయాల కల్పనలో అదానీ ఎంటర్ప్రైజెస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించడం, విశాఖపట్నంలో గూగుల్ భాగస్వామ్యంతో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు, పలు రహదారి, రోప్‌వే ప్రాజెక్టులను దక్కించుకోవడం ద్వారా కంపెనీ తన బలాన్ని నిరూపించుకుంది. విమానాశ్రయాలు, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్ల వంటి భవిష్యత్తు రంగాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామి అవుతోంది.
అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగెషిందర్ సింగ్ తెలిపినట్లుగా.. ఈ ఎన్సీడీ ఇష్యూ ద్వారా సామాన్య పెట్టుబడిదారులకు దేశ మౌలిక వసతుల వృద్ధిలో భాగస్వామ్యం కల్పించడమే తమ ఉద్దేశ్యం. స్థిరమైన, సురక్షితమైన ఆదాయ మార్గాలను వెతుకుతున్న ఇన్వెస్టర్లకు ఇది సరైన సమయం.
-
ఆంజనేయుడి దివ్యమంత్రం -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications