Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పసిడి ప్రియులకు ముందున్నాయ్ గడ్డు రోజులు

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగడం, స్పాట్ మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ ఉదయం ట్రేడింగ్‌ సెషన్ లో 10 గ్రాముల బంగారం ధర 0.34 శాతం పెరిగింది. 1,60,100 వద్ద స్థిరపడింది. అదే సమయంలో వెండి ధర కూడా భారీగా ఎగబాకింది. 2.55 శాతం మేర పెరిగి కిలోకు 2,74,794 రూపాయలకు చేరుకుంది.

ముంబై స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,110గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,47,590కి లభిస్తోంది. గత నెలలో బంగారం, వెండి ధరలు కీలక రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,80,000కు మించి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరగా, వెండి ధర కిలోకు 4,20,000తో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆ తర్వాత అవి క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి.

Gold and Silver Rates Today Gold at Rs 160100 per 10g and Silver at Rs 274794 per kg on February 27

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్లు రూ. 1,48,340 కాగా, 24 క్యారెట్లు రూ. 1,61,820. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,48,240, 24 క్యారెట్లు రూ. 1,61,720. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,590గా ఉంది. ఆయా నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,110కి చేరింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,255, 22 క్యారెట్లు - రూ. 14,900, 18 క్యారెట్లు - రూ. 12,750

ముంబై..

24 క్యారెట్లు - రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు - రూ. 12,118

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు - రూ. 12,118

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు - రూ. 12,118

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు - రూ. 12,118

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు - రూ. 12,118

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+