బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..!!
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో కనిపిస్తున్న స్వల్ప పతనం నేడు కూడా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, కరెన్సీ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ కారణంగా ఈ చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. దీపావళి తర్వాత పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు 8,300 రూపాయల వరకు తగ్గాయి.
నేడు బంగారం ధర 1,600 రూపాయల వరకు తగ్గింది. 10 గ్రాములకు 1,23,146 రూపాయలుగా నమోదైంది. కిందటి వారం ఈ ధర 1,24,794గా ఉండేది. ఇది బంగారం ధరలో 1,648 రూపాయల మేర క్షీణించింది. కామెక్స్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,080 డాలర్లు, వెండి సుమారు 50 డాలర్లకు తగ్గింది. దీని ఫలితంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,23,146 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల ధర సుమారు 2,500 రూపాయల వరకు తగ్గి.. 10 గ్రాములకు రూ. 1,12,802 చేరింది. అంతకుముందు ఈ ధర 1,14,311 రూపాయలుగా ఉండేది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 93,596 నుండి రూ. 92,360 రూపాయలకు క్షీణించింది. ఇందులో 1,200 రూపాయల మేర తగ్గుదల కనిపించింది.
డిసెంబర్లో అమెరికాలో వడ్డీ రేట్ల కోతకు తక్కువ అవకాశం ఉండటం కూడా బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనంగా ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే తక్కువగా తగ్గాయి. అమెరికాలో నాన్-ఫామ్ పేరోల్ డేటా అంచనాల కంటే బలంగా రావడంతో వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ మిశ్రమ సంకేతాల కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగవచ్చు.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 12,687, ముంబై- రూ. 12,583, ఢిల్లీ- రూ. 12,598, కోల్‌కతా- రూ. 12,583, బెంగళూరు- రూ. 12,583, హైదరాబాద్- రూ. 12,583లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో - రూ. 11,629, ముంబై- రూ. 11,534, ఢిల్లీ- రూ. 11,549, కోల్‌కతా- రూ. 11,534, బెంగళూరు- రూ. 11,534, హైదరాబాద్- రూ. 11,534లు. 18 క్యారెట్ల బంగారం ధర- రూ. 9,699, ముంబై- రూ. 9,437, ఢిల్లీ- రూ. 9,452, కోల్‌కతా- రూ. 9,437, బెంగళూరు- రూ. 9,437, హైదరాబాద్- రూ. 9,437గా నమోదైంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications