Railway stocks: పట్టాలెక్కిన రైల్వే స్టాక్స్.. ఇన్వెస్టర్లపై కురుస్తున్న కాసుల వర్షం
IRFC : 17 నెలల నీరిక్షణకు తెరపడింది. భారతీయ స్టాక్ మార్కెట్లో సంచలనం నమోదైంది. జూలై 2024 నుంచి తీవ్ర అప్ అండ్ డౌన్స్ ఎదుర్కుంటూ 60 శాతం మేర నష్టపోయిన రైల్వే షేర్లూ ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇన్ని రోజులు నష్టాలు చవిచూసిన పెట్టుబడిదారులు కేవలం గడిచిన 5 రోజుల్లోనే ఊహించని లాభాలు అందుకున్నారు. అంతా అయిపోయింది అనకున్న తరుణంలో 2025 ఏడాది ముగింపు ఇన్వెస్టర్లను ఆశ్యర్యానికి గురి చేసి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపింది.
అసలే జరిగింది..
భారతీయ రైల్వే టికెట్ రేట్లను సవరించింది. అవి అమలులోకి కూడా వచ్చాయి. ఈక్రమంలోనే రైల్వే స్టాక్స్ రాణిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రైల్వే ఛార్జీలు పెంచడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. గతంలో ఛార్జ్ లు సవరించినప్పుడు చలించని స్టాక్స్ ఈ సారి మాత్రం గణనీయంగా దూసుకుపోయాయి.

ఈ షేర్ల దూకుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు రూ.600 కోట్లు అదనపు ఆదాయాన్ని సమకూర్చనుంది. ఈ పెంపు సెక్టార్ వృద్ధికి దోహదం చేస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో రైల్వే రంగానికి చెందిన కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా అరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెరగడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఐదు రోజుల్లోనే ముప్పై ఏడు శాతం లాభం
ఈ వేవ్ లో జుపిటర్ వ్యాగన్స్ షేర్లు కేవలం ఐదు రోజుల్లోనే ముప్పై ఏడు శాతం పెరిగి అందరి దృష్టిని ఆకర్షించాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 27%, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 20% వృద్ధిని సాధించాయి. వీటితో పాటు ఇర్కాన్, రైల్‌టెల్, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ వంటి కంపెనీలు కూడా భారీ లాభాలను అందుకున్నాయి.
ఇంకా పెరిగే అవకాశం ఉందా?
ఈ ఆకస్మిక లాభాల వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2026-27 కేంద్ర బడ్జెట్లో రైల్వే రంగానికి రికార్డు స్థాయిలో ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల కేటాయింపులు ఉండవచ్చనే అంచనాలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. వందే భారత్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణ, త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు.. అలాగే రైల్వే భద్రత కోసం ప్రవేశపెట్టిన 'కవచ్' వ్యవస్థ వంటి భారీ ప్రాజెక్టులు ఈ కంపెనీల భవిష్యత్తుపై భరోసానిచ్చాయి.
అయితే, ఈ సంబరాల మధ్య స్టాక్ మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్లకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు లాభాలు వస్తున్నాయని పెట్టుబడి పెడితే మీ డబ్బులు ఆవిరయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అని, ఇవి ఇంకా వాటి పాత గరిష్ట స్థాయిలకు చేరుకోలేదని గుర్తు చేస్తున్నారు. తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదని సూచిస్తున్నారు
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications