Silver Price: వెండి ధరల పెరుగుదల వెనుక భారీ భారీ కుట్ర
దేశీయ కమోడిటీ మార్కెట్లో ప్రస్తుతం వెండి ధరలు ( Silver Price) సృష్టిస్తున్న ప్రకంపనలు అటు ఇన్వెస్టర్లను, ఇటు ఆభరణాల రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ లెక్కలకు, దేశీయ బెంచ్‌మార్క్‌లకు అందనంత ఎత్తులో ట్రేడవుతుండటం ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమైంది. ఇది కేవలం డిమాండ్-సప్లై సూత్రం ప్రకారం జరుగుతున్న పెరుగుదలా? లేక తెరవెనుక ఏదైనా 'ప్రైస్ మానిప్యులేషన్' జరుగుతోందా? అన్న అనుమానాలు పరిశ్రమ వర్గాల్లో బలపడుతున్నాయి.
వెండి ధరల్లో కనిపిస్తున్న ఈ అసాధారణ అస్థిరతపై ఆల్ ఇండియా జ్యువెలర్స్ & గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (AIJGF) నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కే లేఖ రాయడం పరిస్థితి తీవ్రతను చాటిచెబుతోంది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే MCXలో కిలో వెండిపై ఏకంగా రూ. 40 వేల వరకు ప్రీమియం ఉండటం ఏ ప్రాతిపదికన సాధ్యమని ఫెడరేషన్ ప్రశ్నిస్తోంది. రాబోయే బడ్జెట్లో వెండిపై దిగుమతి సుంకాలు పెరుగుతాయనే 'పుకార్లను' కొంతమంది కావాలనే వ్యాప్తి చేస్తూ, మార్కెట్లో కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారని AIJGF ఆరోపిస్తోంది. ఈ ఊహాగానాల వల్ల సామాన్య వినియోగదారుడు మరియు చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

అంతర్జాతీయ ఉద్రిక్తతలతో వెండి రేటు..
ధరల పెరుగుదలకు కేవలం స్థానిక కారణాలే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా ఆజ్యం పోస్తున్నాయి. మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్, మరియు ఆర్కిటిక్ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రతి పెట్టుబడిదారుడూ సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం, వెండి వైపు మళ్లుతారు. దీనికి తోడు అమెరికన్ డాలర్ బలహీనపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు వెండి ధరను కిలోకు రూ.3.40 లక్షల గరిష్ట స్థాయికి చేర్చాయి.
MCX వాదన: నిఘా నీడలోనే ట్రేడింగ్
మరోవైపు, తమపై వస్తున్న ఆరోపణలను MCX తోసిపుచ్చింది. ధరల కనుగొనడం (Price Discovery) అనేది కేవలం ఒక అంశంపై ఆధారపడి ఉండదని, దిగుమతి సుంకాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు మరియు స్థానిక డిమాండ్‌ను బట్టి మారుతుంటుందని స్పష్టం చేసింది. ఎక్స్ఛేంజ్ వద్ద ఉన్న నిఘా వ్యవస్థ నిరంతరం ట్రేడింగ్‌ను పర్యవేక్షిస్తుందని, నియమ నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఎక్స్ఛేంజ్ ప్రతినిధులు నొక్కి చెబుతున్నారు.
అంచనాలు అదిరిపోతున్నాయి.. కానీ
గోల్డ్‌మన్ సాచ్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు బంగారం, వెండి ధరలపై తమ అంచనాలను మరింత పెంచుతున్నాయి. కేంద్ర బ్యాంకులు భారీగా నిల్వలు పెంచుకోవడం, ప్రైవేట్ ఇన్వెస్టర్ల ఆసక్తి వల్ల ఈ లోహాలకు ఇకపై కూడా 'గోల్డెన్ డేస్' ఉంటాయని వారు విశ్లేషిస్తున్నారు. కానీ, ఈ స్థాయిలో ధరలు పెరగడం వల్ల దేశీయ ఆభరణాల తయారీ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉంది. కొనుగోలు శక్తి తగ్గడం వల్ల కళాకారుల ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది.
వెండి ధరల్లో ఈ 'స్పీడ్' ఎటు దారితీస్తుందో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు ఉన్నంత కాలం విలువైన లోహాల వేట కొనసాగుతూనే ఉంటుంది. అయితే, మార్కెట్లో వ్యాపించే పుకార్లకు అడ్డుకట్ట వేసి, పారదర్శకమైన ధరల విధానం ఉండేలా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
AIJGF wrote to FM: MCX Silver is trading at an absurd
— AIJGF INDIA (@aijgf4india) January 21, 2026
₹40,000 premium on “import duty hike” rumours. If any change is being considered, was price-sensitive info leaked—and who profited?
Key asks (urgent, time-bound):
Clarify whether any duty revision is under consideration
If… pic.twitter.com/0CUQfR86QW
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications