ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్.. ఆఫీస్ రాకపోతే హైక్ లేదు, ప్రమోషన్ లేదు
కోవిడ్ మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు కల్పించిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇప్పుడు ఉద్యోగులకు సవాల్‌గా మారుతోంది. ఇంటి నుంచే పని చేయడాన్ని అలవాటు చేసుకున్న ఐటీ ప్రొఫెషనల్స్‌ను మళ్లీ ఆఫీసులకు రప్పించడానికి కంపెనీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా కంపెనీలకు భారంగా మారిన వేళ దేశంలో అగ్రగామి ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద చర్చకు దారి తీసింది.
ఇకపై తన ఉద్యోగులు కచ్చితంగా వారానికి ఐదు రోజులు ఆఫీస్ కు రావాల్సిందేననే నిబంధనను టీసీఎస్ కఠినంగా అమలు చేస్తోంది. ఈ పాలసీని పట్టించుకోని ఉద్యోగుల విషయంలో కంపెనీ ఎలాంటి రిలీఫ్ ఇవ్వడం లేదు. ఆఫీస్ అటెండెడ్స్ కేవలం జీతానికి సంబంధించిన అంశంగా మాత్రమే కాకుండా, ఉద్యోగుల పనితీరు రివ్యూలో కూడా కీలక ప్రమాణంగా మారిందని స్పష్టమైంది.

ఈ నేపథ్యంలో గత కొన్ని క్వార్టర్స్ లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రూల్స్ పాటించని ఉద్యోగుల అప్రైజల్స్‌ను టీసీఎస్ నిలిపివేసింది. అప్రైజల్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, ఆఫీస్ కు రాకపోతే శాలరీ హైక్, ప్రమోషన్లు అందవని కంపెనీ ఇంటర్నల్ టాక్. దీంతో పలువురు ఉద్యోగులకు కెరీర్ పరంగా అనూహ్యమైన బ్రేక్ పడింది.
అంతేకాదు, అటెండెన్స్‌కు లింక్ అయ్యే వేరియబుల్ పే, పెర్ఫార్మెన్స్ బ్యాండ్స్ వంటి అంశాలను కూడా కంట్రోల్ చేస్తుంది కంపెనీ. వ్యక్తిగత అవసరాల కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే మినహాయింపులు ఇస్తుండగా, నెట్వర్క్ సమస్యలు వంటి కారణాలను ఆధారంగా చూపడాన్ని కూడా కంపెనీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇది ఉద్యోగుల్లో మరింత ఒత్తిడిని పెంచుతోంది.
ప్రత్యేకంగా బెంగళూరు వంటి ఐటీ హబ్‌లలో ఈ నిర్ణయం పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్య తో పాటు.. బ్రాంచ్ లకు దూరంగా ఉన్న నివాసం ఉంటున్న ఉద్యోగులకు ఇది హెచ్చరికగా మారింది. ఐటీ రంగంలో మళ్లీ వర్క్ ఫ్రం ఆఫీస్ కల్చర్ ను బలపర్చే దిశగా TCS వేసిన ఈ అడుగు, భవిష్యత్తులో ఇతర కంపెనీల విధానాలపై కూడా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications