Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

75 సీట్లు, హెలిప్యాడ్‌, స్విమ్మింగ్ పూల్‌, గోల్ఫ్ కోర్స్.. ఇంత లగ్జరీ ఒకే కారులో? (వీడియో)

Longest Car of the World: మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల కార్లు చూసి ఉంటారు. వాటిలో లిమోజిన్ కారు పొడవుగా ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త మీ కోసమే.

ప్రపంచంలోనే అతి పొడవైన కారు పేరు 'ది అమెరికన్ డ్రీమ్'. ఇది 100 అడుగుల కంటే ఎక్కువ అంటే దాదాపు 30 మీటర్ల నిడివి కలిగి ఉంది. ఈ కారు 'ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు'గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ కారు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఒర్లాండో డెజర్‌ల్యాండ్ పార్క్ కార్ మ్యూజియంలో ఉంది.

World Longest Car 75 Seats Helipad Swimming Pool and Mini Golf in One Vehicle

ఏళ్ల శ్రమ.. గిన్నిస్ రికార్డు
1986 సంవత్సరంలో జే ఓహ్‌బర్గ్ అనే వ్యక్తి ఈ కారును రూపొందించారు. 1976 మోడల్ కాడిలాక్ ఎల్డోరాడో కారు ఆధారంగా 'ది అమెరికన్ డ్రీమ్' రూపుదిద్దుకుంది. ఈ కారును స్క్రాప్ నుంచి తయారు చేశారు. ఈ అసాధారణమైన కారు ఒక కష్టం, ఒక కల, సంవత్సరాల అలుపెరుగని శ్రమ తర్వాత పూర్తయింది. ఇది తయారైన తర్వాత చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.

ఆశ్చర్యపరిచే కారు ప్రత్యేకతలు
ప్రపంచంలోనే అతి పొడవైన కారు అయిన 'ది అమెరికన్ డ్రీమ్' కేవలం దాని పరిమాణం వల్లనే కాక, దానిలోని సౌకర్యాల వల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని క్యాబిన్‌లో 75 మంది కూర్చోవచ్చు. వీఐపీల కోసం ప్రత్యేక రెక్లైనింగ్ సీట్లతో కూడిన ప్రత్యేక సెక్షన్ కూడా ఉంది. ఈ కారుకు మొత్తం 26 చక్రాలు అమర్చబడ్డాయి.

లగ్జరీ సౌకర్యాలు
హెలికాప్టర్ దిగడానికి వీలుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కూడా ఉంది. ఒకేసారి ఆరుగురు ఉపయోగించగలిగేంత పెద్ద స్విమ్మింగ్ పూల్, జాకుజీ (Jacuzzi) సౌకర్యం ఉంది.ఇందులో ఒక మినీ గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది.

మలుపులు తిరిగే విధానం
కారు ఇంత పెద్దగా ఉన్నప్పుడు, మలుపులు తిరిగేటప్పుడు ఎలా తిరుగుతుందో అనే సందేహం రావచ్చు. దీని కోసం, 'ది అమెరికన్ డ్రీమ్' లిమోజిన్ కారు మధ్యలో ఒక హింజ్ (Hinge) అమర్చబడింది. కారును రెండు భాగాలుగా తయారు చేయడంతో, ఈ హింజ్ సహాయంతో మూలల వద్ద తిప్పడం సులభతరం అవుతుంది. 2022లో ఈ కారును పూర్తిగా మరమ్మతులు చేసి ఆటో మ్యూజియంలో భద్రపరిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+