ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏలూరు వింత వ్యాధితో మరో ఇద్దరు మృతి .. కేసుల తగ్గుముఖం.. ఇంకా తేలని మిస్టరీ

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ ఇదే సమయంలో వింత వ్యాధి బాధితులు మరో ఇద్దరు మృత్యు వాత పడటం ఆందోళన కలిగించింది. ఏలూరులో పరిస్థితుల పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇదే సమయంలో ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పుడు ఏలూరు వింత వ్యాధితో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.

Recommended Video

Eluru పెరుగుతున్న ఏలూరు వింత వ్యాధి బాధితుల సంఖ్య..మూడుకు చేరిన మృతులు

Eluru Illness Update: ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించండి: ఏలూరు వింత వ్యాధిపై జగన్ కు చంద్రబాబు లేఖ Eluru Illness Update: ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించండి: ఏలూరు వింత వ్యాధిపై జగన్ కు చంద్రబాబు లేఖ

 వింత వ్యాధితో ఆస్పత్రి పాలైన ఇద్దరు మృతి

వింత వ్యాధితో ఆస్పత్రి పాలైన ఇద్దరు మృతి


రెండు రోజుల క్రితం వింత వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన 56సంవత్సరాల సుబ్బరావమ్మ , 50 సంవత్సరాల చంద్రారావు ను , విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారి చికిత్స పొందుతూ మరణించారు. మృతురాలు సుబ్బరావమ్మ కు వింత వ్యాధి తో పాటుగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యులు చెప్తున్నారు. ఇదే సమయంలో మృతుడి చంద్ర రావు కు ఊపిరితిత్తుల సమస్య ఉందని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే ఈ నెల ఆరవ తేదీన శ్రీధర్ అనే వ్యక్తి వింత వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి మరణంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

బాగా తగ్గిన వింత వ్యాధి కొత్త కేసులు .. బుధవారం కొత్త ప్రాంతాల్లో ఒక్కో కేసు

బాగా తగ్గిన వింత వ్యాధి కొత్త కేసులు .. బుధవారం కొత్త ప్రాంతాల్లో ఒక్కో కేసు

ఇక వింత వ్యాధితో ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య బాగా తగ్గింది . నిన్న రాత్రి నుండి ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసు నుండి చూస్తే 592 కేసులు నమోదు కాగా 511 మంది డిశ్చార్జ్ అయ్యారు. 43 మంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం 33 మందిని విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు . ఇక బుధవారం కొత్తగా లంకపేట, ఆముదాల అప్పలస్వామి కాలనీ, భీమడోలు ప్రాంతాలలో ఒక్కొక్క కేసు నమోదు అయింది.

 నేడు మరోమారు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ .. కేంద్ర బృందాల అధ్యయన పురోగతిపై

నేడు మరోమారు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ .. కేంద్ర బృందాల అధ్యయన పురోగతిపై


ఏలూరులో ప్రబలిన వింత వ్యాధికి గల కారణాలపై జాతీయస్థాయి శాస్త్రవేత్తల నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. ఢిల్లీ ఎయిమ్స్ బృందం, ఇంకా ఏలూరులోనే పర్యటిస్తూ వ్యాధికారకాలపై సమగ్ర అధ్యయనం చేస్తుంది .ఇప్పటివరకు నీటిలో సీసం కంటెంట్ ఎక్కువగా ఉందని గుర్తించారు. మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత తుది నివేదికను అందించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర బృందాలు, వైద్య నిపుణులతో సమీక్ష నిర్వహించి ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవాలని కేంద్ర నిపుణుల బృందాలను కోరారు. ఈరోజు మరోమారు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జాతీయ బృందాల అధ్యయన పురోగతిని, అక్కడి పరిస్థితులను తెలుసుకోనున్నారు.

English summary
Two other victims of the Eluru mysterious disease have died. The victims succumbed to their illness at Vijayawada Hospital. More recently new cases of mysterious disease have been greatly reduced. National teams, on the other hand, have intensified the study. Central teams are based in Eluru to study the pathogenesis. Today, once again, CM Jagan will hold a video conference on Eluru strange disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X