హిందూపురంలో బాలకృష్ణను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత; వైసీపీ దాడులపై వార్నింగ్ ఇచ్చిన బాలయ్య
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీ సత్య సాయి జిల్లాలో పర్యటించారు. బాలకృష్ణ పర్యటనతో జిల్లాలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తన సొంత నియోజకవర్గమైన హిందూపురం నియోజకవర్గ పర్యటనలో ఉన్న బాలకృష్ణను కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఇక బాలకృష్ణ వెంట వెళ్తున్న వాహనాలను సైతం ఆపిన పోలీసులు టిడిపి కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. బాలకృష్ణ కాన్వాయ్ ని గ్రామంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. పోలీసుల తీరుతో, టిడిపి కార్యకర్తల ఆందోళనతో కొడికొండలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

హిందూపురంలో గాయపడిన టీడీపీ కార్యకర్తల పరామర్శకు వెళ్ళిన బాలయ్య అడ్డగింత
హిందూపురం నియోజకవర్గంలో రెండు వారాల క్రితం అధికార వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు టిడిపి కార్యకర్తలు బాలాజీ, నరసింహమూర్తి గాయపడ్డారు వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలు పరామర్శించడానికి బాలకృష్ణ ఈరోజు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. అయితే గ్రామంలోని పరిస్థితులు ఇంకా చల్లబడలేదు అని, ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని ఎక్కువ వాహనాలకు అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు బాలకృష్ణను అడ్డుకున్నారు.

బాలయ్య వాహనంతో పాటు మూడు వాహనాలను మాత్రమే అనుమతించిన పోలీసులు
బాలయ్య వాహనంతో పాటుగా కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పిన పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు అక్కడ పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామానికి ఎక్కువమంది వెళితే మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకొనే అవకాశం ఉందని పోలీసులు ఎమ్మెల్యే బాలయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో పోలీసులు చెప్పిన దానికి అంగీకరించిన బాలకృష్ణ పోలీసుల సూచన మేరకు టిడిపి నేతలను పరామర్శించడానికి వెళ్లారు. బాలకృష్ణ వాహనంతో పాటు మరో మూడు వాహనాలను పోలీసులను అనుమతించారు.

టీడీపీ కార్యకర్తల పరామర్శ .. దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలకు బాలయ్య వార్నింగ్
టిడిపి కార్యకర్త బాలాజీ కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ వైసీపీ నేతలు గ్రామాలలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడిని తాను ఖండిస్తున్నానని బాలకృష్ణ తేల్చిచెప్పారు. మరోసారి కార్యకర్తల జోలికి వస్తే తిరగబడతాం అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వైసిపి ప్రభుత్వం ఏపీలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాదుడే బాదుడు అంటూ బాలయ్య విమర్శలు గుప్పించారు. మట్టి దగ్గర నుంచి ప్రతి దాంట్లో దోపిడీ పర్వం కొనసాగుతుందని బాలయ్య విమర్శలు గుప్పించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బాలకృష్ణ ఒంగోలులో జరుగుతున్న మహానాడు లో పాల్గొనేందుకు వెళ్లారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications