హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

99సార్లు శాంతి మంత్రం.. 100వ సారే యుద్దం, పవన్ కల్యాణ్ పోస్ట్, చర్చ

|
Google Oneindia TeluguNews

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే క్రేజే వేరు. జనసేన పార్టీ స్థాపించిన ఆయన.. సినిమాలు కూడా చేస్తున్నారు. ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ మూవీ మాత్రం పెద్ద దుమారమే రేపింది. టికెట్ల ధర తగ్గింపు, ఐదో షోకు పర్మిషన్ ఇవ్వకపోవడం.. బెనిఫిట్ షోకు ఛాన్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో మాటల యుద్దం కంటిన్యూ అవుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ఓ పోస్ట్ పెట్టారు. అదీ ఎవరినీ ఉద్దేశించి అనే చర్చ మాత్రం జరుగుతుంది.

పవన్ పోరాటం..


ఏపీ సర్కారుతో జనసేనాని పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారు. అయితే ఆయన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తానని చెప్పారు. తనది ఎప్పుడూ శాంతి మంత్రం అని చెప్పారు. హింసకు తావులేదని పరోక్షంగా సంకేతాలను ఇచ్చారు. కానీ 100వ సారి మాత్రం ఊరుకోబోనని చెప్పారు. అప్పుడు యుద్ధం చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పెన్సిల్ ఆర్ట్ పిక్ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా చర్చకు దారితీసింది.

ధరల అంశంపై భగ్గు

ధరల అంశంపై భగ్గు


సినిమా టికెట్ల ధరల అంశంలో ఏపీ ప్రభుత్వంపై గతంలో పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ రిలీజ్ కాగా, ప్రతి థియేటర్ వద్ద ఏపీ సర్కారు రెవెన్యూ అధికారులను మోహరించింది. సినిమా టికెట్లు ప్రభుత్వం జీవో ప్రకారమే అమ్ముడయ్యేలా చర్యలు తీసుకుంది. దీంతో మూవీకి ఒకరకంగా లాస్ వచ్చింది. దీంతో చిత్ర బృందం.. ఆగ్రహాంతోనే ఉంది. పవన్ కల్యాణ్ కూడా గుస్సా అయ్యారు. అవును జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎవరి వెర్షన్ వారిదే

ఎవరి వెర్షన్ వారిదే


ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు లేవు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం జనంతో కలిసిపోతున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. తన మూవీపై కక్షసాధింపు చర్యలను మాత్రం తప్పుపడుతున్నారు. ఇదీ సరికాదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇండస్ట్రీకి సాయం చేయాలే తప్ప.. ఇలా చేయడం భావ్యం కాదని అంటున్నారు. కానీ ప్రజల కోసమే టికెట్ల రేట్లను పెంచడం లేదని ప్రభుత్వం అంటోంది. ఇలా ఎవరీ వెర్షన్‌‌ను వారు వినిపిస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ తాజాగా పెట్టిన పోస్టు మాత్రం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.

English summary
99 times will be peace, 100th time go to war janasena chief, power star pawan kalyan tweets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X