హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సామీ.. కేటీఆర్ నాస్తికుడు, యజ్ఞ యాగాదులు అంటూ.. కేసీఆర్‌పై బండి గుస్సా

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యంగ విమర్శలు చేశారు. తాను గొప్ప హిందువున‌ని కేసీఆర్ చెప్పుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. కానీ ఈ భ‌యంక‌ర హిందువు త‌న‌యుడు కేసీఆర్ ఒక నాస్తికుడు. ముందు నీ కొడుకును భ‌క్తుడిగా మార్చు కేసీఆర్ అని కోరారు. హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్, బీజేపీ నేత‌లు రాజాసింగ్, విజ‌య‌శాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

సీఎం స్వార్థంతో యాగాలు చేస్తుండొచ్చు. రాష్ట్రంలోని మంత్రులంతా కూడా నాస్తికులే. అందుకే తెలంగాణ స‌మాజంలో హిందూ దేవుళ్ల‌కి అవ‌మానం జ‌రుగుతోందని బండి సంజయ్ అన్నారు. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే ఇలాంటి చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌లు అడ్డుకోవాల్సిందేనని చెప్పారు. ఓ మంచి ఆలోచ‌న‌తో ముందుకు వెళ్దామని కోరారు. శ‌క్తిమంత‌మైన‌, ప్ర‌జాస్వామ్య విలువ‌లు ఉన్న తెలంగాణ‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం అని కోరారు. మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయు అడుగుజాడ‌ల్లో అంద‌రూ న‌డుద్దాం అని బండి సంజ‌య్ పిలుపునిచ్చారు.

bandi sanjay coments on cm kcr

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. యాసంగి పంటపై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కొనాలని రాష్ట్రం.. ఇదివరకు యాసంగి బియ్యం అప్పగించాలని కేంద్రం పరస్పర ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్.. మతానికి సంబంధించి కామెంట్స్ చేశారు. అదీ కూడా యజ్ఞ యాగాదులు చేసే కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. మరీ దీనిపై అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలీ మరీ. వరి పంట కొనుగోలు అంశానికి సంబంధించి దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ అటాక్ చేశారు. కేటీఆర్‌ని నాస్తికుడు అని విమర్శలు చేశారు. తీన్మార్ మల్లన్న హిమాన్షుపై కామెంట్స్ వివాదం నడుస్తోన్న వేళ.. సంజయ్ కామెంట్లపై గులాబీ దళం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలీ మరీ.

English summary
bjp state president bandi sanjay slams cm kcr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X