హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వనపర్తికి కేసీఆర్, మన ఊరు- మన బడికి అంకురార్పణ

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్ జిల్లాల బాట పట్టారు. అవును జిల్లాలు తిరుగతూ జనంతో కలిసిపోతున్నారు. నిన్న రాష్ట్ర బడ్జెట్ సెషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెషన్ మళ్లీ రేపు ప్రారంభం కానుంది. ఈ లోపు కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటనకు వస్తోన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని లాంఛనంగా ఇక్కడి నుంచే శ్రీకారం చుడతారు.

వనపర్తిలోని జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్‌‌లో కార్యక్రమం ప్రారంభించారు. వనపర్తి మండలం చిట్యాలలో అగ్రికల్చర్‌ మార్కెట్‌ యార్డు, నాగవరంలో నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, వనపర్తి పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను కూడా కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇటీవల జిల్లా హెడ్ క్వార్టర్‌లో కలెక్టరేట్.. అలాగే తమ పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే జిల్లాకు వచ్చిన సందర్భంగా అన్నీ పనులను చూసి మరీ వెళుతున్నారు.

cm kcr tour to wanaparthy

నాగవరంలో మెడికల్‌ కాలేజీకి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. నూతన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించిన తర్వాత సాయంత్రం మెడికల్‌ కాలేజీకి కేటాయించిన స్థలంలో జరిగే బహిరంగ సమావేశంలో మాట్లాడతారు. వచ్చే ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సమయం తీసుకొని మరీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రేపు బడ్జెట్ సెషన్ తిరిగి ప్రారంభమై.. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Recommended Video

Bhatti Vikramarka Pressmeet.. Telangana Budget పై విమర్శలు | Oneindia Telugu

సీఎం కేసీఆర్ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి వనపర్తికి చేరుకోనున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు తిరుగు పయనం అవుతారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటుంది.

English summary
telangana cm kcr tour to wanaparthy district. today he launched mana ooru- mana badi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X