హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విడతలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు: అసెంబ్లీలో మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రోగ్రాం అయినా ప్రణాళిక బద్దంగా తీసుకుంటుందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శాఖామంత్రి కేటీఆర్ తెలియజేశారు అలా తీసుకున్న కార్యక్రమాలను పక్కా ప్రణాళితకతో అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పలు అభివృద్ది కార్యక్రమాలు విడతల వారీగా అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధి కోసమేనని ఆయన స్పష్టంచేశారు.

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. సిటీలో మోతాదుగుకు మించి వాహనాలు ఉన్నాయనీ.. ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉందన్నారు. దానిని పరిష్కరించటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం 2 వేల కోట్లతో మొదటి దశలో 22 ఫ్లైఓవర్లు పూర్తి చేశామని అలాగే గ్రేటర్ శివారు ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని.. ఒక్క ఎల్బీనగర్ పరిధిలో 850 కోట్లతో నాలా అభివృద్ధి పనులు జరగనున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రతి లొకేషన్ కి ఫ్లైఓవర్- లింక్ రోడ్‌తో అనుసంధానంగా ఉందని తెలిపారు.

development will done with installments in state minister ktr told to assembly

తెలంగాణలో జ‌న‌ప‌నార మిల్లును ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీల‌తో ప్ర‌భుత్వం అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్నామని కేటీఆర్ తెలిపారు. జ‌న‌ప‌నార ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీల‌కు ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కం క‌ల్పిస్తోందనీ..రెండు వ‌రి పంట‌ల మ‌ధ్య‌న మూడో పంట‌గా జ‌నుము పంట‌ను పండిచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం వీలు కల్పిస్తోందని తెలిపారు. వ‌రి ధాన్యం ఉత్ప‌త్తిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర‌భాగాన ఉందన్నారు. రైతుల‌కు ఇబ్బంది ఉండకూడదనే ఉద్ధేశ్యంలో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వ‌రి ధాన్యం సేక‌రించాంని వెల్లడించారు.

బెంగాల్, బంగ్లాదేశ్‌లో జ్యూట్ మిల్స్ మూత‌ప‌డ్డాయి. గొనే సంచుల‌కు విప‌రీత‌మైన కొర‌త వ‌చ్చింది. స‌రిప‌డ గోనె సంచులు లేక ఇబ్బంది ప‌డ్డామని కేటీఆర్ తెలిపారు. ఈ సమస్యలపై సీఎం కేసీఆర్ ఈ సమస్యల కోసం మనం వేరే దిశగా ఆధారపడే కంటే మనమే మన రాష్ట్రంలోనే గోనె సంచుల‌ను ఉత్ప‌త్తి చేసే దిశ‌గా ఆలోచించాల‌ని సూచించారని. రాయితీలు ఇచ్చి పెట్టుబ‌డుల‌ కోసం కంపెనీలకు ఆహ్వానించాల‌ని సూచించారు.

English summary
development will done with installments in state minister ktr told to assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X