జిహెచ్ఎంసి మరో బృహత్కర నిర్ణయం.!రోడ్ల అభివృద్దికి వేగవంతంగా స్థల సేకరణ.!
హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ సమస్యను అదిగమించేందుకు రోడ్ల వెడల్పు నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియను వేగవంతంచేసి పనులను నిర్థేశిత కాలంలో పూర్తిచేసే దిశగా జిహెచ్ఎంసి బృహత్కర ప్రణాళిక రచంచినట్టు తెలుస్తోంది. నగర ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనలో జిహెచ్ఎంసి అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా నూతన మాస్టర్ ప్లాన్ అమలులో రోడ్ల వెడల్పు, అభివృద్ది, లింకు రోడ్లు, స్లీప్ రోడ్లు, జంక్షన్ ల అభివృద్ది, ఫ్లైఓవర్, అండర్ పాస్ అనేక అభివృద్ది పనులను చేపడుతుంది. టౌన్ ప్లానింగ్ వింగ్ రోడ్ అభివృద్ది ప్లాన్ లో భాగంగా ఆస్తులను గుర్తించి, రోడ్డు వెడల్పులో ఆస్తులు కోల్పోయిన వారిని గుర్తించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా నష్ట పరిహారం చెల్లించడం జరుగుతుందని నగర పాలక సంస్థ అధికారులు స్పష్టం చేసారు.

Recommended Video
టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా గత 5సంవత్సరాల కాలంలో 89 రోడ్లు వెడల్పు పనులు చేపట్టగా 55 రోడ్ల పనుల పూర్తికాగా వాటి కోసం 1805 ఆస్తులను సేకరించడం జరిగిందని అధికారులు దృవీకరిస్తున్నారు. రోడ్ల వెడల్పులో భాగంగా ఆస్తులు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందించేందుకు టి.డి.అర్ సర్టిఫికెట్లను జారీ చేసి అట్టి మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా చెల్లింపు చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు 16,95,449 స్క్వేర్ యార్డ్స్ (సుమారు 350 ఏకరాలు) కోసం 864 టి.డి.అర్ లను జారీచేశారని తెలుస్తోంది. బయో డైవర్సిటి ఫ్లై ఓవర్, దుర్గం చెరువు హై టెక్ సిటీ ఆర్.యు.బి, బైరమల్ గూడ నుండి చింతల్ కుంట చెక్ పోస్ట్ వరకు అండర్ పాస్, ఎల్ బి నగర్ ఫ్లై ఓవర్, అండర్ పాస్ నాగోల్ ఫ్లైఓవర్, కామినేని జంక్షన్ ఫ్లైఓవర్, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, అంబర్ పేట, బహదూర్ పూర్, కందికల్ గేట్, ఉప్పుగూడ ఫ్లైఓవర్లు ప్రాపర్టీ సేకరణ పూర్తైందని, బాలాపూర్ జంక్షన్, షేక్ పేట్ ఫ్లైవర్, ఖాజాగూడ రోడ్, బాపూఘాట్ నుండి అత్తాపూర్ మిస్సింగ్ లింక్ రోడ్, జూబ్లిహిల్స్ నుండి నార్నే వరకు, ఓల్డ్ బాంబే హై నుండి లెదర్ పార్కు వరకు జూబ్లీహిల్స్, నోవాటెల్ నుండి ఆర్.టి.ఐ ఆఫీస్ కొండాపూర్, నిజాంపేట్ నుండి ముంబాయి హైవే, జోహ్ర బి దర్గా నుండి రక్షాపురం వరకు లింక్ రోడ్లు, ఓల్డ్ బాంబే హై నుండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు స్లిప్ రోడ్ల ప్రాపర్టీ సేకరణ పూర్తి చేయడం జరిగిందని అధికారులు వెళ్లడించారు.












Click it and Unblock the Notifications