• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అవంతి అరణ్య రోదన: ఒక్కసారి కళ్లు తెరవవా, భర్త భౌతికకాయం వద్ద.., చితిపై పడుకొనే యత్నం..

|

సమాజంలో కొందరు మారడం లేదు. కుల, మతాల పట్టింపులతో.. పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. మిర్యాలగూడ మారుతీరావు చేసిన ఘోరం కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇదే సమయంలో సిటీలో అవంతికి కూడా అలాంటి అన్యాయం జరిగింది. సొంత తండ్రి, బావలు కలిసి.. హేమంత్‌ను కడతేర్చారు. అతని అంత్యక్రియలు శనివారం చందానగర్ శ్మశానవాటికలో జరిగాయి.

అవంతి రోదన..

అవంతి రోదన..

ప్రాణంగా ప్రేమించిన భర్త దూరం కావడంతో అవంతి గుండెలవిసేలా రోదించింది. ఒక్కసారి కళ్లు తెరవు అంటూ ఆమె రోదన అక్కడున్న వారిని కలచివేసింది. తమ ప్రేమ శాపమయ్యిందని.. కడతేర్చే వరకు వెళ్తుందని ఊహించలేదని నిట్టూర్చింది. ఇటు హేమంత్ తల్లి కూడా బోరున విలపించారు. హేమంత్ అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన చితీపై పడుకునే ప్రయత్నం చేసింది. ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు వారించారు. ఆమెను పక్కకు తీసుకెళ్లారు.

ప్రేమించి పెళ్లి చేసుకుంటే..

ప్రేమించి పెళ్లి చేసుకుంటే..

హేమంత్-అవంతి.. ఎనిమిదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వారి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక ఆమె ఇంటి నుంచి బయటకొచ్చింది. నాలుగునెలల క్రితం హేమంత్‌ను పెళ్లి చేసుకుంది. చందానగర్‌లో పేరంట్స్ ముందు ఉండటం ఎందుకని గచ్చిబౌలిలో ఉంటున్నారు. అయినా వారు వినిపించుకోలేదు. హేమంత్‌ను కడతేర్చేవరకు తమ పగ చల్లారలేదు అన్నట్టు ప్రవర్తించారు.

మూడు కార్లలో ఇంటికొచ్చి.. బలవంతంగా తీసుకెళ్లి...

మూడు కార్లలో ఇంటికొచ్చి.. బలవంతంగా తీసుకెళ్లి...

గురువారం సాయంత్రం అవంతి బావ, మామయ్యలు మూడు కార్లలో ఇంటికొచ్చారు. ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. అయితే కారు వెళ్తుండగా.. అవంతి కారులో నుంచి దూకి పారిపోయింది. విషయం హేమంత్ తన పేరంట్స్‌కు తెలియజేశారు. వెంటనే వారు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హేమంత్ ఆచూకీ కోసం పోలీసులు కూడా అన్వేషించారు. కానీ జాడ మాత్రం తెలియలేదు. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కొల్లయ్యగూడెం వద్ద హేమంత్ మృతదేహం లభించింది. దీంతో హేమంత్-అవంతి ప్రేమ విషయం వెలుగుచూసింది.

మరొకరు బాధ పడొద్దు..

మరొకరు బాధ పడొద్దు..

ఇటు హేమంత్ తల్లి తమలా మరొకరు బాధ పడొద్దని చెబుతున్నారు. మారుతీరావు ఉదంతం సమయంలోనే తాను బాధపడ్డానని చెప్పారు. తన కుమారుడు, అవంతికి కూడా ఇదే విషయం చెప్పానని తెలిపారు. ఒప్పించి పెళ్లి చేసుకోవాలని కోరానని.. సంబంధాలు చూడటంతో అవంతి బయటకొచ్చిందని తెలిపారు. కానీ ఇంతలోనే ఇలా చేస్తారని ఊహించలేదు అని పేర్కొన్నారు.

  ప్రోటోకాల్ కోసమేనా నెమలికి అంత్యక్రియలు
  కఠిన శిక్ష..

  కఠిన శిక్ష..

  కానీ హేమంత్‌ను హత్య చేయడంపై చర్చానీయాంశమైంది. అవంతి పేరంట్స్, బంధువుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టం లేకుంటే ఒక వ్యక్తిని చంపటం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. చంపేత పాపం ఏం చేశారు అని నిలదీస్తున్నారు. మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామంటూ విమర్శిస్తున్నారు. హేమంత్ హత్యలో పాలుపంచుకున్న 12 మందిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

  English summary
  Hemanth funeral end at chandanagar Cremation ground. avanthi and hemanth mother are very saddened.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X