మాదాపూర్ మెట్రోలో పనిచేయని ఆన్‌లైన్ టికెటింగ్.. ప్రయాణికుల ఇబ్బందులు
అసలే వర్షాలు.. ఆపై వరద బురద, ఇంకేముంది జనాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక హైదరాబాద్ గురించి అయితే చెప్పక్కర్లేదు. వర్షంలో బస్సు కన్నా మెట్రో మేలని చాలా మంది అనుకుంటారు. త్వరగా గమ్యం చేరుకోవాలని అందులోనే ప్రయాణం చేస్తారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం రూట్లలో మెట్రో ఫుల్‌గా ఉంటాయి. ఇక వాన పడితే అంతే సంగతులు
అందరూ త్వరగా ఇంటికి చేరుకోవాలి. అందుకోసమే మెట్రో బాట పట్టారు. అయితే శుక్రవారం హైదరాబాద్‌లో వాన ఎక్కువే కురిసింది. ఇంకేముంది మాదాపూర్ మెట్రో స్టేషన్‌కు జనం చేరుకున్నారు. కొందరు పాస్ తీసుకుంటారు. మరికొందరు అయితే టికెట్ తీసుకుంటారు. టికెట్ పెడితేనే వెళ్లడానికి అనుమతి ఉంటుంది. అయితే వర్షం కురిసిన సమయంలో మాదాపూర్‌లో ఆన్ లైన్ టికెట్ పనిచేయలేదు.

దీంతో జనం ఇబ్బంది మాములగా లేదు. త్వరగా ఇంటికి వెళ్లాలనే మూడ్‌లో ఉన్నారు. ఆన్ లైన్ పనిచేయకపోవడంతో ఊసురుమన్నారు. అప్పటికే చాలా మంది లైనులో నిల్చొని ఉన్నారు. అయితే వారందరికి మాన్యువల్‌గా టికెట్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మెట్రోలు వెళుతుంటాయి కూడా.. సో ఆ జనం ఇబ్బందులు మాములుగా లేవు.