హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్మాతల్లో ఐక్యత లేదు.. మోహన్ బాబు‌పై సీ కల్యాణ్ విసుర్లు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వం, సినీ పరిశ్రమకు చెందిన కొందరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇండస్ట్రీ వ్యక్తుల మధ్య కూడా వాదనలు జరుగుతున్నాయి. సినిమా పరిశ్రమ అంటే నలుగురు హీరోలు, నలుగురు నిర్మాతలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని మోహన్ బాబు అన్నారు. నిర్మాతల మధ్య ఐక్యత లేదని చెప్పారు. ఈ కామెంట్లపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్ స్పందించారు. మోహన్ బాబు వ్యాఖ్యలను తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.

Recommended Video

AP Tickets Rates: Telugu Film Industry Lacks Unity - Mohan Babu | RGV | Oneindia Telugu
నిర్మాతల మండలి..

నిర్మాతల మండలి..


అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో నిర్మాతల మండలి చర్చిస్తూనే ఉందన్నారు. నిర్మాతల్లో ఐక్యత లేదని మోహన్ బాబు అన్నారని... ఆయన కూడా ఒక నిర్మాతే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. విష్ణు కూడా నిర్మాతేనని అన్నారు. మీ కుటుంబం మొత్తం సినిమా రంగంలోనే ఉందని చెప్పారు. సమస్య పరిష్కారం కాదని అనుకుంటే మీరే ముందుండి పరిష్కరించండని మోహన్ బాబుకు కల్యాణ్ సూచించారు. మీరు ముందుంటే తామంతా మీ వెనుక ఉంటామని చెప్పారు. నిర్మాతల్లో ఐక్యత లేదని చెప్పడం సరికాదని అన్నారు. ఈ కామెంట్లపై మోహన్ బాబు ఇంకా స్పందించాల్సి ఉంది.

మోహన్ బాబు లేఖాస్త్రం

మోహన్ బాబు లేఖాస్త్రం

అంతకుముందు ఫైర్ బ్రాండ్ మోహన్ బాబు గళం విప్పారు. సినిమా టికెట్ల అంశంపై లేఖాస్త్రం సంధించారు. సినిమా ఇండస్ట్రీ అంటే కొందరే కాదు అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను సినిమాకు పెద్దన్న పాత్ర పోషించలేను అని చిరంజీవి నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే మోహన్ బాబు లేఖ బాంబ్ పేలింది. సినిమా టికెట్ల అంశానికి సంబంధించి ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు ఏపీ మంత్రులతో చర్చలు జరిపారు. టికెట్ రేట్ గురించి మాట్లాడొద్దని దిల్ రాజు బహిరంగంగా చెప్పారు. సీనియర్ నటుడు మోహన్ బాబు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్‌ను షేర్ చేశారు.

మౌనంగా ఉండలేను..

మౌనంగా ఉండలేను..

కలసి సినిమాని బతికిద్దాం అంటూ మంచు మోహన్ బాబు బహిరంగ లేఖ రాశారు. మనకెందుకు అని మౌనంగా వుండాలా.. నా మౌనం చేతకానితనం కాదు.. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారని గుర్తుచేశారు. ఇండస్ట్రీ అంటే వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు.. వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట ఇదీ అని భావొద్వేగానికి గురయ్యారు. మోహన్ బాబు కామెంట్లపై దుమారం రేగింది.

English summary
cinema producer c kalyan slams actor mohan babu on ticket rate issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X