హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటకిరిటీకి కరోనా: ఆస్పత్రిలో చేరిక, మైల్డ్ సింప్టమ్సే

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ మహామ్మారి ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే బాలీవుడ్‌, టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. బీటౌన్‌లో ఏక్తా కపూర్, అర్జున్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, సింగర్ విశాల్ డడ్లానీతో పాటు టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబుకు కరోనా సోకడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. వీరే కాకుండా త్రిష, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, సీనియర్‌ హీరో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ కరోనా బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. రాజేంద్ర ప్రసాద్‌ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు.

rajendra prasad infected coronavirus

కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.

ఇటు కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే.. ఆ ఫ్యామిలీకి దాదాపుగా వస్తోంది. సన్నిహితంగా మెలిగితే చాలు వైరస్ వస్తోంది.

కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశంలోని 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 3,623 కేసులు నమోదయ్యాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.

English summary
actor rajendra prasad infected coronavirus. he is treated aig hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X