హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేఖాస్త్రం: కేసీఆర్‌కు రేవంత్ లేఖ, పంట నష్ట పరిహారం..

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం గురించి ప్రస్తావించారు. బాధితులకు తక్షణం పంట అంచనా వేయించాలని కోరారు. పంటల బీమా అమలు కాకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు.

కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. సదరు రైతులకు తక్షణం రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. వేసిన నారు కూడా చాలా చోట్ల చనిపోయిన పరిస్థితి.. దీంతో ఏం చేయాలో అర్థం కాక అన్నదాతలు తలలు పట్టుకున్నాడు.

Revanth reddy write letter to cm kcr

Recommended Video

KCR was misleading the people of Telangana in the name of land auction -Revanth Reddy

వర్షాలతో వాగులు, వంకలు నిండాయి, చెరువులు, నదులు, ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. దిగువకు నీరు విడుదల చేశారు. మొక్క జొన్న పంటకు వర్షం కాస్త మేలు చేసింది. కొన్ని పంటలకు మాత్రం నష్టం కలిగించింది. దీనికి సంబంధించి పరిహారం ఇవ్వాలని విపక్షాలు కోరుతున్నాయి. బాధితులకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ నష్టం ఎక్కువగా అందజేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

ఇటు హుజురాబాద్ బై పోల్ కూడా దగ్గరలో ఉంది. ఇక్కడ ఈటల రాజేందర్ ఒక్కరే బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరగా.. ఆయనకు టికెట్ ఇస్తారా లేదో అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఆయనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

English summary
Revanth reddy write letter to cm kcr for flood relief fund issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X