• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నా భర్తను చంపేశారు: రేపిస్ట్ రాజు భార్య: టీవీ చూస్తూ కుప్పకూలిన కుటుంబం

|

యాదాద్రి భువనగిరి: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. దారుణంగా హతమార్చిన నిందితుడు పళ్లంకొండ రాజు ఆత్మహత్య చేసుకోవడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. చిన్నారి ప్రాణాన్ని చిదిమేసిన కామాంధుడు రాజు మరణించడం పట్ల బాధిత కుటుంబంతో పాటు వేలాదిమంది సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు. తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోన్నారు.

స్టేషన్ ఘన్‌పూర్ వద్ద పట్టాలపై..

నిందితుడు రాజు మృతదేహం ఈ ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైల్వే పట్టాల వద్ద మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుడిచేతి మీద ఉన్న మౌనిక అనే టాటూతో ఆ మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అతను మరణించాడనే విషయం తెలిసిన వెంటనే వేలాదిమంది స్పందించారు. అతను ఏ విధంగా మరణించినా.. అది సమాజానికి మేలు చేసేదేనని పేర్కొన్నారు.

గుండెలవిసేలా..

ఈ సమాచారం తెలిసిన వెంటనే రాజు భార్య, ఇతర కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. టీవీ చూస్తూ కుప్పకూలిపోయారు. శోకసముద్రంలో మునిగిపోయారు. టీవీల్లో ప్రసారమౌతోన్న కథనాలను చూస్తూ గుండెలు అవిసిపోయేలా రోదించారు. రాజు భార్య మౌనిక, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాజు భార్య మౌనిక స్వస్థలం.. యాదాద్రి జిల్లాలోని అడ్డగూడూర్. మద్యానికి బానిస అయిన రాజు.. రోజూ మందు తాగి వచ్చి తీవ్రంగా కొట్టడం, చిత్రహింసలకు గురి చేయడాన్ని భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయారు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటోన్నారు.

చంపేశారంటూ..

రాజు మృతదేహం పట్టాలపై లభించినట్లు ఈ ఉదయం నుంచి వేర్వేరు న్యూస్ ఛానళ్లలో ప్రసారమౌతోన్న కథనాలను చూస్తూ మౌనిక విషాదంలో మునిగిపోయారు. తన భర్త ఆత్మహత్య చేసుకుని ఉండడని, అతణ్ని చంపేశారని ఆరోపించారు. ఇక తన కుటుంబానికి దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం టీవీల ద్వారా తెలుసుకున్న మౌనిక సోదరి ఆమె ఇంటికి చేరుకున్నారు. సముదాయించే ప్రయత్నం చేశారు. తమ రాజును చంపారని ఆరోపిస్తున్నారంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. చుట్టుపక్కల వారు మౌలిక ఇంటికి చేరుకున్నారు.

ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..

ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..

కాగా- రాజు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించిన సమయంలో పెద్ద ఎత్తున ఎన్ఎస్‌యూఐ ప్రతినిధులు అడ్డుకున్నారు. దీనితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించారు. స్వల్పంగా లాఠీ ఛార్జీ చేశారు. రాజు మృతదేహాన్ని తీసుకొస్తోన్న అంబులెన్స్‌ను ఎన్‌ఎస్‌యుఐ ప్రతినిధులు, స్థానికులు అడ్డుకున్నారు. అంబులెన్స్‌పై చెప్పులను విసిరివేయడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని కిందికి దించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారిని చెదరగొట్టారు.

English summary
Saidabad incident accused Raju wife Mounika alleged that the Police has killed her husband after Saidabad Raju's dead body found on railway track near Station Ghanpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X