బెట్టింగ్ యాప్‌లకు బిగ్ షాక్… 300 ప్లాట్‌ఫామ్‌లు బ్లాక్ చేసిన ప్రభుత్వం
భారత దేశంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా అక్రమంగా పనిచేస్తున్న 300కు పైగా గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లను బ్లాక్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు కేంద్రం బ్లాక్ చేసిన అక్రమ ప్లాట్‌ఫామ్‌ల మొత్తం సంఖ్య 8,400కు చేరింది.
అక్రమ సైట్లపై చర్యలు..
కాగా బ్లాక్ చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌లలో ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్‌లు, క్యాసినో గేమింగ్ సైట్లు, బెట్టింగ్ ఎక్స్ఛేంజ్లు ప్రధానంగా ఉన్నాయి. అంతేకాకుండా డబ్బు వెచ్చించి ఆడే కార్డ్ గేమ్స్, రమ్మీ తరహా యాప్‌లు, మట్కా నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న యాప్‌లపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. విదేశీ సర్వర్ల ద్వారా పనిచేస్తూ భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న యాప్‌లను ప్రత్యేకంగా గుర్తించి బ్లాక్ చేస్తున్నారు.

అక్రమ గేమింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, 2025 కీలకంగా మారింది. 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించేలా నిబంధనలు ఉన్నాయి.
ప్రత్యేక నియంత్రణ సంస్థ..
ఈ రంగాన్ని సమర్థంగా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అక్రమ యాప్‌లను గుర్తించడం, సాంకేతికంగా బ్లాక్ చేయడం, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తోంది.
ఈ అక్రమ బెట్టింగ్ సైట్ల ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్, పన్ను ఎగవేత జరుగుతున్నట్లు కేంద్రం గుర్తించింది. బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ గేట్వేలను దుర్వినియోగం చేస్తూ కోట్ల రూపాయలు విదేశాలకు తరలిస్తున్న నెట్‌వర్క్‌లపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యేకంగా యువతను ఆకర్షించేలా సోషల్ మీడియా, ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్ల ద్వారా ఈ యాప్‌లు విస్తరిస్తున్నాయి. సులభంగా డబ్బు సంపాదించవచ్చని చెప్పి వినియోగదారులను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
ప్రజలకు హెచ్చరికలు..
ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూ, గుర్తింపు లేని యాప్‌లు, వెబ్సైట్లలో డబ్బు పెట్టవద్దని హెచ్చరిస్తోంది. అక్రమ గేమింగ్ యాప్‌లలో పాల్గొనడం కూడా నేరమని స్పష్టం చేసింది. వినియోగదారులు అధికారికంగా అనుమతించిన ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచిస్తోంది. సాంకేతికతను వినియోగించి అక్రమ గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోనుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇతర దేశాలతో కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications