చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై సహా 4 జిల్లాల్లో ఫుల్ లాక్ డౌన్, 19వ తేదీ నుంచి 12 రోజులు, పాలు, ఆస్పత్రి, మెడికల్ షాపు...

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత వైరస్ కేసులు ఎక్కువ ప్రభావం ఉన్నది తమిళనాడులోనే.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పకబ్బందీ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రాజధాని చెన్నై అనుకొని ఉన్న గ్రామాల్లో ఈ నెల 19 నుంచి పూర్తిస్థాయి లాక్ డౌన్ కొనసాగుతోందని సీఎం పళనిస్వామి ప్రకటించారు. రెండువారాల పాటు కఠినంగా అమలు చేస్తామని.. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపులు ఉంటాయని తెలిపారు. సోమవారం సీఎం పళనిస్వామి మల్టీ డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహించాక.. తన నిర్ణయాన్ని ప్రకటించారు.

4 Tamil Nadu Districts Will Switch to Total Lockdown Mode..

చెన్నై, తిరువల్లూరు, చెంగల్ పేట్, కాంచీపురం జిల్లాల్లో 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామని చెప్పారు. రెండువారాల్లో ఆదివారాలు కూడా సడలింపులు ఉండవని స్పష్టంచేశారు. సరుకులు, కూరగాయాలు, పండ్లు, పెట్రోల్ బంక్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరచి ఉంటాయని స్పష్టంచేశారు.

టీ షాప్స్ కూడా క్లోజ్ చేస్తారని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హోటళ్లు తెరిచే ఉంటాయని.. కానీ పర్సెల్ చేయాలని తేల్చిచెప్పింది. హోటళ్లలో పనిచేసే సిబ్బంది విధిగా ఐడీ కార్డు ధరించాలని స్పష్టంచేశారు. టాక్సీ, ఆటో, ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. విమానాలు, రైలు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని అనుమతిస్తామని తెలిపారు. ఈ 12 రోజుల్లో పాలు, ఆస్పత్రి, మెడికల్ షాపులకు మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండబోవు అని పేర్కొన్నారు.

English summary
Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami said Chennai and adjoining areas will be under lockdown from June 19 to 30 sans present relaxations and a full-scale shutdown on two Sundays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X