వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 స్కూళ్లకు బాంబ్ బెదిరింపు.. రంగంలోకి బాంబ్ స్వ్కాడ్.. ఎక్కడ అంటే..

|
Google Oneindia TeluguNews

బాంబ్ బెదిరింపు మెయిల్‌లో ఐటీ సిటీ బెంగళూరు ఉలిక్కి పడింది. అయితే స్కూళ్లకు వార్నింగ్ రావడంతో ఆందోళన నెలకొంది. ఏడు పాఠశాలలకు బాంబ్ థ్రెట్ వచ్చింది. ఆయా స్కూళ్లకు పోలీసు బృందాలు చేరుకున్నాయని.. తనిఖీలు చేస్తున్నాయని బెంగళూర్ పోలీస్ కమిషనర్ కమ్ల్ పంత్ తెలిపారు. మహాదేవపురలో గల గోపలాన్ ఇంటర్నేషనల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, న్యూ అకాడమీ స్కూల్, సెయింట్ విన్సెంట్ పాల్ స్కూల్, హెన్నూర్ అండ్ ఇండియన్ పబ్లిక్ స్కూల్, ఈబెనెజర్ ఇంటర్నేషనల్ స్కూళ్లకు బాంబ్ బెదిరింపు వచ్చిందని వివరించారు.

7 Bengaluru Schools Get Bomb Threat

ఆయా స్కూళ్ల వద్దకు బాంబ్ స్క్వాడ్ టీం కూడా వెళ్లిందని ఆయన తెలిపారు. ఈ మెయిల్ రావడంతో స్కూళ్లను తణికీ చేస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని.. ఇన్ఫో అందితే వెంటనే మీడియాకు తెలియజేస్తానని తెలిపారు. బాంబ్ బెదిరింపు మెయిల్‌తో బెంగళూరు ఆందోళన చెందింది. పేరంట్స్, బంధువులు, ప్రజలు భయపడ్డారు. కరోనా తర్వాత ఇప్పడిప్పుడే స్కూళ్లు నడుస్తున్నాయని.. ఇప్పుడు థ్రెట్ ఏంటీ అని అడుగుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను స్కూళ్ల నుంచి ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని సీపీ వెల్లడించారు.

కర్ణాటకలో గత కొద్దీ రోజులుగా హిజాబ్ పై వివాదం నడుస్తోంది. తాజాగా హలాల్, హజాన్ పై కూడా రగడ నడుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన అల్ ఖైదా హిజాబ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. దీనిపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై.. ఇప్పటికే విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ సమయంలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కల్గిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఆ ఏడే కాదు.. అన్ని పాఠశాలలను ఖాళీ చేయిస్తోంది. పోలీసులను అప్రమత్తం చేసింది. అన్నీ చోట్ల ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

English summary
Received bomb threat through e-mail and police teams are at the spot conducting checks Bengaluru City Police Commissioner Kamal Pant said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X