హీరో ఉపేంద్ర రాజకీయ పార్టీ వెబ్ సైట్ ప్రారంభం, ఒక్క నెల డెడ్ లైన్, 224 చోట్ల పోటీ చేస్తాం!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: స్యాండిల్ వుడ్ రియల్ స్టార్, దర్శకుడు, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ) వ్యవస్థాపకుడు ఉపేంద్ర సమాజంలో ఉన్న లోటుపాట్లు సరిదిద్దటానికి మరో ముందుడగు వేశారు. కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ వెబ్ సైట్ ను హీరో ఉపేంద్ర శనివారం ప్రారంభించారు.

కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ కార్యక్రమాలు, ఉపేంద్ర రాజకీయ పర్యటనల వివరాలు ఈ వెబ్ సైట్ లో పెడుతున్నారు. 'కేపీజేపీఉప్పి'పేరుతో ప్రారంభం అయిన వెబ్ సైట్ లో కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ లక్షం, కార్యక్రమాల వివరాలు పొందుపరిచారు.

Actor Upendra launches KPJP website in Karnataka

2018లో కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. కర్ణాటకలోని 224 శాసన సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఉపేంద్ర క్లారిటీ ఇచ్చారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆసక్తి ఉన్న వారు ఈ వెబ్ సైట్ లో వారి వివరాలు పొందుపరచాలని ఉపేంద్ర సూచించారు.

విద్యావంతులకే కాదు విద్యాభ్యాసం లేని వారు సైతం తమ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చెయ్యవచ్చని ఉపేంద్ర వివరణ ఇచ్చారు. మా పార్టీలో కుల, మత బేదాలకు చోటులేదని, పోటీ చెయ్యడానికి అర్హులైన వారిని ప్రజలు ఈ వెబ్ సైట్ ద్వారా ఎంపిక చెయ్యాలని ఉపేంద్ర వివరించారు. ఒక్క నెలలో శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల ప్రచారం చేస్తామని ఉపేంద్ర క్లారిటీ ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka prajnavantha janata Party(KPJP) President(Hon) Upendra launches website to reveal naked truth.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి