వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదానీ గ్రూప్ సంచలనం: రూ. 20వేల కోట్ల ఎఫ్‌పీవో రద్దు, ఇన్వెస్టర్లకు తిరిగి డబ్బు

ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 20,000 కోట్ల విలువైన షేర్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీవో)ని రద్దు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 20,000 కోట్ల విలువైన షేర్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీవో)ని రద్దు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ బుధవారం ప్రకటించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికన్ షార్ట్ సెల్లర్.. అదానీ గ్రూప్ పన్ను స్వర్గధామాల(టాక్స్ హెవెన్స్)ను ఉపయోగిస్తోందని ఆరోపించింది. ఒక నివేదికలో రుణ సమస్యలను ఫ్లాగ్ చేసిందని పేర్కొంది.

రూ. 20 వేల కోట్ల ఎఫ్‌పీవోను రద్దు చేసిన అదానీ

రూ. 20 వేల కోట్ల ఎఫ్‌పీవోను రద్దు చేసిన అదానీ

ఈ నేపథ్యంలో 'ఈ రోజు అంటే ఫిబ్రవరి 1, 2023న జరిగిన కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో, దాని చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రూ. 20,000 కోట్ల వరకు ఉన్న ఈక్విటీ షేర్ల తదుపరి పబ్లిక్ ఆఫర్ (FPO)ను కొనసాగించకూడదని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. పాక్షికంగా చెల్లించిన ప్రాతిపదికన ఒక్కొక్కటి రూ. 1 విలువ, ఇది పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేస్తున్నాం' అని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు

'అదానీ గ్రూప్: హౌ ది వరల్డ్స్ 3వ రిచెస్ట్ మ్యాన్ ఈజ్ పుల్లింగ్ ది లార్జెస్ట్ కాన్ ఇన్ కార్పోరేట్ హిస్టరీ' అనే శీర్షికతో హిండెన్‌బర్గ్ తన పరిశోధనా నివేదికలో అదానీ గ్రూప్ అకౌంటింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ పద్ధతులను ప్రశ్నించి, సమస్యను కూడా లేవనెత్తినప్పటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్‌లు ఒత్తిడిలో ఉన్నాయి. గత వారం తీవ్ర నష్టాలను చవిచూశాయి. హిండెన్‌బర్గ్ నివేదిక.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పిఓను దెబ్బతీసేందుకు "మాలా ఫైడ్ ఉద్దేశ్యం"తో కాలయాపన చేసిందని అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను గట్టిగా ఖండించింది.

చట్టబద్ధంగానే నడుచుకుంటున్నామంటూ అదానీ కౌంటర్

చట్టబద్ధంగానే నడుచుకుంటున్నామంటూ అదానీ కౌంటర్

అదానీ గ్రూప్ గతంలో న్యూయార్క్‌కు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు 413 పేజీల వివరణాత్మక ప్రతిస్పందనను జారీ చేసింది. "నిరాధార ఆరోపణలు, తప్పుదారి పట్టించే కథనాలు సంబంధిత పత్రాల ద్వారా మద్దతు ఇస్తున్నాయి" అని అదానీ గ్రూప్ తెలిపింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అహ్మదాబాద్‌కు చెందిన గ్రూప్ అన్ని స్థానిక చట్టాలకు కట్టుబడి ఉందని, అవసరమైన రెగ్యులేటరీ బహిర్గతం చేశామని పేర్కొంది.

English summary
Adani Group calls off FPO worth of 20,000 crore, says will return money to investors, amid Hindenburg Row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X