అజిత్ పవార్ మరణంతో ఆ విమానాలను నిలిపేస్తారా..? యజమాని షాకింగ్ రిప్లై..
మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ మరణించారు. విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిన నేపథ్యంలో అజిత్ పవార్ తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో విమానంలో అజిత్ పవార్ తో పాటుగా మరో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఇద్దరు క్రూ సభ్యులు ఉన్నారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణంపై పలువురు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇక అజిత్ పవార్ ప్రయాణించిన బాంబార్డియర్ లియర్ జెట్45 విమానాన్ని దిల్లీకి చెందిన వీఎస్‌ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నిర్వహిస్తోంది. 2023లోనూ ఈ మోడల్ విమానం ముంబైలో క్రాష్ లాండ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నాలుగు ప్రచార సభలకు ఈ విమానంలోనే అజిత్ పవార్ వెళ్లినట్లు సమాచారం. ఈ విమానన్ని 1990 దశకంలో తయారు చేశారు. ఈ విమానంలో గరిష్టంగా 8 మంది ప్రయాణించే వీలుంది.
అయితే అజిత్ పవార్ మరణంతో ఈ మోడల్‌ కు చెందిన ఇతర విమానాలను నిలిపివేస్తారా..? అని మీడియా ప్రతినిధులు వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ యజమాని వీకే సింగ్‌ ను ప్రశ్నించారు. దానికి ఆయన షాకింగ్ రిప్లై ఇచ్చారు. తమ విమానాల ఫిట్ నెస్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని తెలిపారు. అవి ప్రయాణాలకు అనువుగానే ఉన్నట్లు వెల్లడించారు. విమానాలు ఫిట్ గా ఉంటే వాటిని నిలిపివేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఇక ఈ విమాన ప్రమాదానికి గల కారణాలను ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రమాద సమయంలో బారామతి ఎయిర్ పోర్టులో విజిబిలిటీ చాలా తక్కువగా ఉండటం కారణంగా రన్ వే ను గుర్తించడంలో పైలట్లు ఇబ్బంది పడ్డారని తెలిపారు. రన్ వే సరిగ్గా కనిపించకపోవడం వల్లే ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications