వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖేష్ అంబానీకి సెక్యూరిటీ భయం .. స్కార్పియో యజమాని మర్డర్ , కేసు ఏటీఎస్ కు బదిలీ

|
Google Oneindia TeluguNews

స్కార్పియో వాహనంలో జిలెటిన్ స్టిక్స్ పెట్టి ముఖేష్ అంబానీ కి హెచ్చరిక లేఖ రాసిన ఈ వ్యవహారంలో ఊహించని విధంగా స్కార్పియో వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ మృతి చెందిన విషయం తెలిసిందే .అయితే మన్సుఖ్ హిరెన్ మృతికేసును మర్డర్ కేసుగా పోలీసులు కేసును యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు బదిలీ చెయ్యటం కలకలం రేపింది . మొదట కారు యజమాని మృతి ఆత్మహత్యగా భావించిన పోలీసులు దర్యాప్తు అనంతరం కేసును మర్డర్ గా గుర్తించి ఏటీఎస్ కు బదలాయించటంతో పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో ట్విస్ట్ .. స్కార్పియో యజమాని అనుమానాస్పద మృతిముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో ట్విస్ట్ .. స్కార్పియో యజమాని అనుమానాస్పద మృతి

 ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు .. స్కార్పియో వాహనం మన్సుఖ్ హిరెన్ మరణంతో కేసులో కొత్త మలుపు

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు .. స్కార్పియో వాహనం మన్సుఖ్ హిరెన్ మరణంతో కేసులో కొత్త మలుపు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి దగ్గరలో పేలుడు పదార్థాల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే . ఇటీవల ఆంటిలియా సమీపంలో జెలిటిన్ స్టిక్స్ ఉన్న స్కార్పియో ను గుర్తించిన ముంబై పోలీసులు ఆ కారులో అంబానీ కుటుంబానికి ఓ బెదిరింపు లేఖను కూడా గుర్తించారు. స్కార్పియో వాహనం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు చేశారు. స్కార్పియో వాహనం రిజిస్టర్డ్ యజమాని మన్సుఖ్ హిరెన్ ను గుర్తించిన పోలీసులు అతనిని విచారించారు. అతను తన వాహనం దొంగిలించబడిందని పోలీసులకు చెప్పారు. ఆ వాహన యజమాని సడన్ గా మరణించటం కేసులో ఉత్కంఠను రేపుతుంది .

 అంబానీకి బాంబు బెదిరింపు కేసులో మన్సుఖ్ మాత్రమే కీలక సాక్షి .. కేసు మళ్ళీ మొదటికి

అంబానీకి బాంబు బెదిరింపు కేసులో మన్సుఖ్ మాత్రమే కీలక సాక్షి .. కేసు మళ్ళీ మొదటికి

ఈ కేసులో మన్సుఖ్ హిరెన్ మాత్రమే కీలక సాక్షి . ఇంతకు మించి ఈ కేసును విచారించటానికి ఎలాంటి ఆధారాలు లేవు . అయితే ఊహించని విధంగా ఇంటి నుండి బయటకు వెళ్ళిన మన్సుఖ్ హిరెన్ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహం కల్వా క్రీక్‌లో, థానేలోని రెతి బందర్ ప్రాంతంలో కనుగొనబడింది. గురువారం రాత్రి కందివాలి యూనిట్ నుండి క్రైమ్ బ్రాంచ్ అధికారిని కలవడానికి తాను థానేలోని ఘోడ్‌బందర్ ప్రాంతానికి వెళుతున్నానని హిరెన్ తన కొడుకుతో చెప్పి, అతను ఆటోలో వెళ్ళాడు కానీ హిరెన్ ఇంటికి తిరిగి రాలేదు. హిరెన్ ఇంటికి రాలేదని మరుసటి రోజు తెల్లవారు ఝామున మిస్సింగ్ కేసు నమోదు చేశారు . ఆతర్వాత శవమై కనిపించాడు .

 హిరెన్ ను చంపి ఆపై కాలువలో పడేసినట్టు పేర్కొన్న హిరెన్ కుటుంబ సభ్యులు

హిరెన్ ను చంపి ఆపై కాలువలో పడేసినట్టు పేర్కొన్న హిరెన్ కుటుంబ సభ్యులు

హిరెన్ అన్నయ్య వినోద్ మాట్లాడుతూ ఇది హత్య అని చెప్పాడు. మన్సుఖ్ హిరెన్ కు బాగా ఈత వచ్చని, ఆయన ఒక క్రీక్ లోకి దూకి తన జీవితాన్ని అంతం చేసుకునేంత పిరికివాడు కాదని పోలీసులకు వెల్లడించారు .

అతని నోట్లో గుడ్డలు కుక్కి మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారని ఆయన పేర్కొన్నారు . కాల్వలో పడేయటానికి ముందే చంపినట్టు పోలీసులు చెప్పారన్నారు .

పోస్ట్‌మార్టం నిర్వహించిన కల్వాలోని ఛత్రపతి శివాజీ ఆసుపత్రి వైద్యులు మరణానికి గల కారణాలపై తమ అభిప్రాయాన్ని రిజర్వు చేసుకోగా, శరీరానికి ఎక్కడా ఎలాంటి గాయం లేదని వారు తెలిపారు.

ఇంకా దొరకని హిరెన్ మొబైల్ ... దర్యాప్తు చేస్తున్న ముంబ్రా , క్రైం బ్రాంచ్ పోలీసులతో పాటు ఏటీఎస్ అధికారులు

ఇంకా దొరకని హిరెన్ మొబైల్ ... దర్యాప్తు చేస్తున్న ముంబ్రా , క్రైం బ్రాంచ్ పోలీసులతో పాటు ఏటీఎస్ అధికారులు

హిరెన్ శుక్రవారం రాత్రి థానే తన కార్యాలయం నుండి బయలుదేరాడు మరియు రాత్రి 10.30 తర్వాత అతని మొబైల్ స్విచ్ ఆఫ్ చేయబడింది. దర్యాప్తులో, పోలీసులు మొబైల్ ఫోన్ సిగ్నల్స్ చివరగా వాసాయి సమీపంలోని ఒక గ్రామం వద్ద గుర్తించారు . అయితే, పోలీసులు ఇంకా మొబైల్ ఫోన్‌ను రికవరీ చేయలేదు. హిరెన్ యొక్క వస్తువులు ఏమయ్యాయో , అతన్ని రేతి బందర్ వద్దకు ఎలా తీసుకెళ్ళారో తెలుసుకోవడానికి పోలీసులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. ముంబ్రా పోలీసులతో పాటు క్రైమ్ బ్రాంచ్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఉగ్రవాద నిరోధక దళ అధికారులు శనివారం ఉదయం రేతి బందర్‌ను సందర్శించారు, ఇంకా ముంబై, థానే పోలీసుల నుంచి దర్యాప్తు పత్రాలను పరిశీలించనున్నారు .

మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏటీఎస్ .. అంబానీ కేసు మరింత తీవ్ర రూపం

మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏటీఎస్ .. అంబానీ కేసు మరింత తీవ్ర రూపం


థానేలోని వారి నివాసంలో అధికారులు మన్సుఖ్ కుటుంబాన్ని విచారించిన ఒక రోజు తర్వాత ఈ కేసును శనివారం అధికారికంగా ఎటిఎస్‌కు అప్పగించారు. ఉదయం 11 గంటల నుండి నాలుగు గంటలకు పైగా విచారణ జరిగింది, అక్కడ అధికారులు మన్సుఖ్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను తీసుకున్నారు .

ఎటిఎస్ అధికారులు ఈ మిస్టరీ మరణంపై హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం, ఉమ్మడి ఉద్దేశం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి విచారిస్తున్నారు. దీంతో ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసు మరింత తీవ్ర రూపం దాల్చింది.

English summary
It is learned that Mansukh Hiren, the owner of the Scorpio vehicle, in the affair of writing a warning letter to Mukesh Ambani by putting gelatin sticks in the Scorpio vehicle died unexpectedly . Industry tycoon Mukesh Ambani is suspected to be in danger as police initially thought the car owner's death was a suicide and later identified the case as murder and transferred it to the ATS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X