కీలక నిర్ణయాల దిశగా కేంద్రం..: అమిత్ షాపైనే భారం
ఢిల్లీలోని చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుడులో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి ఢిల్లీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తోన్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉంటోంది. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.
గుజరాత్ లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తర్వాత ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థంతో కూడుకుని ఉన్న ప్రదేశాలు, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా పెంచారు. రాత్రంతా పోలీసులు పహారా చేపట్టారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం వదిలిపెట్టారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. ఈ పేలుడు కోసం ఉపయోగించిన హ్యుందాయ్ i20 నంబర్ HR 26 CE 7674కారుపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కారు 2014 నుండి నాలుగు సార్లు చేతులు మారింది. దీనికి సంబంధించిన ఏ ఒక్క రికార్డు కూడా నమోదు కాలేదని దర్యాప్తులో తేలింది. తొలుత సల్మాన్ అనే వ్యక్తి ఈ కారును 2014 మార్చి 18న కొనుగోలు చేశారు. ఆ తర్వాత దేవేంద్ర, సోనూ దీన్ని కొన్నారు. చివరిగా తారిఖ్ పేరు మీద ఇది రిజిస్టర్ అయింది. ఇవేవీ రికార్డుల్లో లేవు.
దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థను రంగంలోకి దింగింది. సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఢిల్లీ వ్యాప్తంగా ఉగ్రకదలికలపై నిఘా పెట్టింది. యూఏపీఏ కింద కేసులు నమోదయ్యాయి. యూఏపీఏలోని సెక్షన్లు 16, 18, ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌లోని సెక్షన్లు 3, 4, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 103(1), 109(1), 61(2) కింద ఈ కేసు పెట్టారు. రెడ్ ఫోర్ట్ ను మూసివేశారు. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే- రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ కూడా క్లోజ్ అయింది.
మరోవంక- ఈ ఘటనపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీ కర్తవ్య భవన్లో ఈ భేటీ ఏర్పాటైంది. హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications