ఫాస్టాగ్ లో అనూహ్య మార్పులు..!!
ప్రతి వాహనానికీ అత్యవసరమైన ఫాస్టాగ్ లో.. ఈ ఏడాది సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. యాన్యువల్ పాస్ మొదలుకుని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వరకు పలు మార్పులు సంభవించాయి. అవన్నీ కూడా వాహనదారులకు అనుకూలంగా ఉన్నవే.. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ను నివారించడానికి ఉద్దేశించినవే. క్రమంగా టోల్ గేట్లల్లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పూర్తి స్థాయిలో అమలులోకి రాబోతోంది కూడా.
రూ. 1000 రిటర్న్ గిఫ్ట్..
ఫాస్టాగ్ వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది.. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై పరిశుభ్రతను పెంపొందించడానికి ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందీ ఈ ఏడాదే. టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రమైన మరుగుదొడ్లను గుర్తించి, వాటికి సంబందించిన వివరాలను అందజేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది. 1,000 రూపాయల మొత్తాన్ని వారి ఫాస్టాగ్ ఖాతాలో జమ చేస్తుంది. పరిమితంగా అమలులో ఉందా పథకం.

KYV తప్పనిసరి..
"నో యువర్ వెహికల్" (KYV) విధానం ఈ ఏడాది నుంచే తప్పనిసరి అయింది. ఎన్హెచ్ఏఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా దీన్ని అమలు చేస్తోన్నాయి. ఫాస్టాగ్ వినియోగదారులు తమ వాహనానికి సంబంధించిన ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డిజిటల్ కాపీని అప్లోడ్ చేయడం వల్ల ఫాస్టాగ్ సరైన వాహనంతో అనుసంధానమైందా లేదా అనేది తేలిపోతుంది. వాహనాల చోరీ, అక్రమ వినియోగం వంటి సమస్యలను అధిగమించడానికి దీన్ని అమలు చేసింది.
యాన్యువల్ పాస్..
కొత్తగా టోల్ పాసులు అమలులోకి వచ్చాయి ఈ ఏడాదిలోనే. వార్షిక టోల్ పాస్ ధర- 3,000 రూపాయలు. దీన్ని కొన్న తేదీ నుంచి మరుసటి ఏడాది అదే తేదీ వరకు 200 ట్రిప్పులు రాకపోకలు సాగించే వీలు వాహనదారులకు ఉంటుంది. ఈ సౌకర్యం నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తించదు. ఆగస్టు 15వ తేదీన స్వాత్రంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వార్షిక ఫాస్టాగ్ టోల్ పాస్ ను అమలులోకి తీసుకుని వచ్చింది. ఏడాది లేదా.. 200 ట్రిప్పులు.. వీటిలో ఏది ముందుగా వస్తే అది- చెల్లుబాటు అవుతుంది.
ఏఎన్పీఆర్ కెమెరాలు..
ఫాస్టాగ్ కు ప్రత్యామ్నాయంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ప్రయోగాత్మకంగా అమలులోకి వచ్చింది. చెన్నై - బెంగళూరు, తాంబరం - విల్లుపురం జాతీయ రహదారి జీఎస్టీ రోడ్ పై పైలెట్ ప్రాజెక్ట్ కింద దీన్ని అమలులోకి వచ్చాయి. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఇక ఆగనక్కర్లేదు. ఈ అధునాతన కెమెరాలు గంటకు 100-150 కి.మీ. వేగంతో కదులుతున్న వాహనాల వివరాలను కూడా ఖచ్చితంగా నమోదు చేయగలవు. అలాగే- 40 మీటర్ల దూరం వరకు వీడియో ఫుటేజీని రికార్డు చేస్తాయి.
శాటిటైల్ ఆధారిత టోల్ గేట్లు..
వచ్చే ఏడాది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ దేశంలోని అన్ని టోల్ గేట్ల వద్ద అందుబాటులోకి రానుంది. 2026 చివరి నాటికి దీన్ని అమలు చేయాలని ఉపరితల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. భవిష్యత్తులో ఏఐ, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ ద్వారానే టోల్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నూతన టోల్ విధానం శాటిలైట్, AI సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో కూడా సునాయాసంగా దాటిపోవచ్చు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications