జమ్మూ బోర్డర్ లో మరో పాకిస్తానీ డ్రోన్ కలకలం .. కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ దళాలు !!

జమ్మూకశ్మీర్ సరిహద్దులలో తాజాగా డ్రోన్ల దాడితో, ఆ తర్వాత వరుసగా మిలటరీ క్యాంప్ వద్ద డ్రోన్లు కలకలం సృష్టించడంతో సీరియస్ గా తీసుకున్న ఆర్మీ నిఘా పెంచింది. వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడికి పాల్పడిన తర్వాత నుండి వరుసగా భద్రతా దళాలు డ్రోన్లను గుర్తిస్తూనే ఉన్నారు. తాజాగా జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్‌లోని ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న అనుమానాస్పదంగా ఎగురుతున్న పాకిస్తాన్ క్వాడ్‌కాప్టర్‌పై సరిహద్దు భద్రతా దళం బిఎస్‌ఎఫ్ ఈరోజు తెల్లవారుజామున కొన్ని రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో డ్రోన్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయింది.

బిఎస్ఎఫ్ జమ్మూ సరిహద్దు ఇన్స్పెక్టర్ జనరల్ ఎన్ఎస్ జమ్వాల్ మాట్లాడుతూ పాకిస్తానీ డ్రోన్ జీరో లైన్ మరియు సరిహద్దు కంచె మధ్య తిరుగుతున్నట్టు గుర్తించి అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారని వెల్లడించారు. ఇది పాకిస్తాన్ భూభాగంలోకి తిరిగి వెళ్లిందని పేర్కొన్నారు. ఇది నిఘా కోసం ఉపయోగించే గూడచారి క్వాడ్‌కాప్టర్ అని జమ్వాల్ చెప్పారు. డ్రోన్ తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించామని, ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఏమి లభించలేదని ఆయన చెప్పారు.

 Another Pakistani drone spotted near the border in Jammu

ఇంటిలిజెంట్ హెచ్చరికల ఆధారంగా బిఎస్‌ఎఫ్ దళాలు శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పాకిస్తాన్‌కు చెందిన క్వాడ్‌కాప్టర్‌పై కాల్పులు జరిపాయని ఈ కాల్పుల కారణంగా, అది వెంటనే తిరిగి వెళ్లిపోయిందని, డ్రోన్ ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి నిఘా కోసం ఉద్దేశించబడిందని చెప్పారు. డ్రోన్ కనిపించిన వెంటనే బిఎస్ఎఫ్ దళాలు 20 నుండి 25 రౌండ్ల వరకు కాల్పులు జరపగా, పాకిస్తానీ డ్రోన్ తిరిగి వెనక్కి వెళ్ళింది అంటూ పేర్కొన్నారు.

జమ్మూలోని ఐఎఎఫ్ స్టేషన్‌పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు, తరువాత కాలూచక్, రత్నుచక్, సుంజువాన్ మరియు కుంజ్వానీలోని సైనిక స్టేషన్లపై డ్రోన్ లు వరుసగా నాలుగు రోజులుగా నిత్యం తిరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్‌ల వాడకాన్ని కొత్త సవాలుగా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే పేర్కొన్నారు. డ్రోన్ దాడి కేసుపై ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జి, సిఐఎస్‌ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో మరో మారు డ్రోన్ కలకలం సృష్టించడం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు నిదర్శనంగా నిలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+