వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము కశ్మీర్ ఎయిర్ బేస్‌లో యాంటీ డ్రోన్ వ్యవస్థ..

|
Google Oneindia TeluguNews

జమ్ము ఎయిర్ బేస్ టెక్నికల్ ఏరియాలో డ్రోన్ దాడులు ఈ నెల 27న జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గత కొన్నిరోజులుగా గుర్తు తెలియని డ్రోన్లు దర్శనమిస్తుండడం ఆందోళన కలిగించింది. దీంతో భారత వాయుసేన స్థావరంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. యాంటీ డ్రోన్ వ్యవస్థను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) ఇక్కడ మోహరించినట్టు వాయుసేన వర్గాలు తెలిపాయి.

రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్, సాఫ్ట్ జామర్ లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించాయి. డ్రోన్లు ఇవాళ కనిపించినట్టు ప్రత్యక్ష సాక్షుల తెలిపారు. మిరాన్ సాహిబ్, కాలుచక్, కుంజ్వానీ ప్రాంతాల్లో వీటిని గుర్తించారు. ఇటు జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. వరసగా డ్రోన్లను ప్రయోగిస్తున్నాయి. దీనిని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. జమ్ము మిలిటరీ స్టేషన్ వద్ద సోమవారం కూడా డ్రోన్లు కలకలం రేపాయి. దీంతో దాడి చేసే అవకాశం ఉందని ఆర్మీ హెచ్చరించింది. తమ సిబ్బంది కాల్పులు జరపడంతో.. డ్రోన్లను వెనక్కి వెళ్లిపోయానని చెప్పారు.

anti drone system deployed-in jammu kashmir airbase

ఆదివారం జమ్ము ఎయిర్ బేస్‌పై జరిగిన దాడికి లష్కరే తోయిబా హస్తం ఉండొచ్చని కశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఆ గ్రూపే డ్రోన్లను ప్రయోగించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల టైంలో కుంజ్వాని, రత్నుచుక్ ఏరియాలో డ్రోన్లు కనిపించాయి. అయితే కొద్ది సేపటి తర్వాత మళ్లీ అవి కనిపించలేదు. కుంజ్వాని ప్రాంతం సత్వారి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

English summary
anti drone system deployed-in jammu kashmir airbase
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X