ఆ విషయంలో వరల్డ్ లోనే బెంగళూరు రెండో ప్లేస్.. హైదరాబాద్ స్థానం ఇదే..?
ప్రపంచ దేశాల్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పలు కారణాలతో పట్టణాల్లో నివసించేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పుడు ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అయింది. ఎక్కడ చూసినా రోడ్లపై గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నగరాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతోందని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రపంచంలో ఏయే నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందనే అంశంపై టామ్ టామ్ సంస్థ ఒక నివేదిక వెల్లడించింది.
2025 డేటా ప్రకారం.. భారత్ లోని పలు నగరాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. సంవత్సరంలో ఒక వారం వరకు సమయాన్ని కోల్పోతున్నారు. ఇక తాజాగా నెదర్లాండ్స్ కు చెందిన సంస్థ టామ్ టామ్ విడుదల చేసిన 2025 రద్దీ డేటా ప్రకారం.. బెంగళూరు ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ గల నగరంగా ఉంది. ఇక్కడ సగటు వేగం గంటకు 16.6 కిలోమీటర్లుగా ఉంది. ఒక వాహనదారుడు 4.2 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 15 నిమిషాల సమయం పడుతుంది.

ఇక ఈ జాబితాలో ఉన్న భారతీయ నగరాల వివరాలు చూస్తే.. ముంబై 18వ స్థానంలో ఉంది. దిల్లో 23వ స్థానంలో ఉంది. అలాగే కోల్ కతా 2024 లో ట్రాఫిక్ రద్దీలో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ 2025లో 29వ స్థానానికి పడిపోయింది. అలాగే చెన్నై 32వ స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ 47వ స్థానంలో నిలిచింది.
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?











Click it and Unblock the Notifications