బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు ఆర్ఆర్ నగర్ ఎన్నికల కౌంటింగ్, నువ్వానేనా, బీజేపీకి నాన్ లోకల్ ముద్ర, కాంగ్రెస్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ ( ఆర్ఆర్ నగర్) శాసన సభ నియోజక వర్గం ఎన్నికల ఫలితాలు మే 31వ తేదీ గురువారం ప్రకటించనున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. మే 28వ తేదీ సోమవారం ఆర్ఆర్ నగర శాసన సభ నియోజక వర్గం పోలింగ్ శాంతియుతంగా జరిగింది. ఆర్ఆర్ నగర్ లో 53 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఆర్ఆర్ నగర్ లో మూడు పార్టీల నువ్వానేనా అంటు పోటీపడ్డారు. గురువారం మద్యాహ్నంకు ఆర్ఆర్ నగర్ విజేత ఎవరో తేలిసిపోతుంది.

మూడు పార్టీలు పోటి

మూడు పార్టీలు పోటి

ఆర్ఆర్ నగర శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులతో పాటు మొత్తం 14 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. నువ్వానేనా అంటూ మూడు పార్టీల నాయకులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు, బీజేపీ నుంచి మునిరాజు గౌడ, జేడీఎస్ నుంచి రామచంద్రప్ప పోటీ చేశారు.

జేడీఎస్ రివర్స్

జేడీఎస్ రివర్స్

ఆర్ఆర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడుకు జేడీఎస్ పార్టీ అభ్యర్థి రామచంద్రప్ప మద్దతు ఇప్పించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. అయితే జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్పతో పాటు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ సైతం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.

 భారీ బందోబస్తు

భారీ బందోబస్తు

4,54,201 మంది ఓటర్లు ఉన్న ఆర్ఆర్ నగర్ లో 421 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. ఆర్ఆర్ నగర్ లోని జ్ఞానాక్షి విద్యాసంస్థలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఒక డీసీపీ, నలుగురు ఏసీపీలు, 10 మంది ఇన్స్ పెక్టర్లతో పాటు 300 మంది ఎస్ఐలు, పోలీసులు బందోబస్తులో నిమగ్నం అయ్యారు.

ప్రభుత్వానికి అనుకూలం

ప్రభుత్వానికి అనుకూలం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడు గెలిచినా, జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్ప గెలిచినా కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడ విజయం సాధిస్తే బీజేపీకి మరో సీటు పెరిగే అవకాశం ఉంది.

బీజేపీకి నాన్ లోకల్ ముద్ర

బీజేపీకి నాన్ లోకల్ ముద్ర


బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడ నాన్ లోకల్ అనే ముద్ర పడటంతో ఆయన మీద ఓటర్లు పెద్ద ఆసక్తి చూపించలేదని సమాచారం. ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గం పరిధిలో మొత్తం 9 బీబీఎంపీ వార్డులు (కార్పొరేటర్లు) ఉన్నాయి. గురువారం మద్యాహ్నంలోపు ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే ఎవరు అనే విషయం తేలిపోనుంది.

English summary
Karnataka Election Results 2018: Rajarajeshwari Nagar. Get latest Trends, Results, Rajarajeswhari Nagar assembly constituenciy. Polling held on May 28th and results to be announced on May 31st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X