భారత్ కు బిగ్ రిలీఫ్ .. 30 వేలకు దిగువనే కొత్త కేసులు, 3 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
భారతదేశంలో కరోనా కేసుల నమోదు కొనసాగుతోంది. క్రమంగా కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 30 వేలకు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 26,041 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి . దీంతో ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,78,786 కు పెరిగింది.

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,99,620
గత 24 గంటల్లో దేశంలో 29,621 రికవరీలు నమోదు కాగా, దీంతో మొత్తం దేశంలో ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,29,31,972 కి చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 78.89 శాతంగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 276 మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం మొత్తం మరణాల సంఖ్య 4,47,194 గా నమోదైంది. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,99,620 గా ఉన్నాయి. కరోనా యాక్టివ్ కేసులు తగ్గటం కాస్త ఊరటనిస్తుంది. కరోనా యాక్టివ్ కేసులు 0.90 శాతం గా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోని 1,63,855 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

కేరళ రాష్ట్రంలో తాజాగా 15951 కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో గత 24 గంటల్లో 38,18,362 మందికి వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇచ్చిన మొత్తం టీకాల సంఖ్య 86,01,59,011 గా ఉంది. ఇదిలా ఉంటే గడచిన 24 గంటల్లో 11,65,006 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇక తాజాగా కేరళ రాష్ట్రంలో 15951 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో 3206 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

వివిధ రాష్ట్రాలలో గత 24 గంటల్లో నమోడైన్ కొత్త కేసులు ఇలా
ఇక తమిళనాడు రాష్ట్రంలో 24 గంటల్లో 1694 కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1184 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారం జరుగుతున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 748 కరోనా కేసులు నమోదు కాగా కర్ణాటకలో 775 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో 1478 కేసులు నమోదయ్యాయి. ఇక ఒడిశా రాష్ట్రంలో 585 కేసులు, తెలంగాణ రాష్ట్రంలో 170 కరోనా కేసులు నమోదయ్యాయి .దేశ రాజధాని ఢిల్లీలో 29 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణనీయంగా కరోనా కంట్రోల్ లోకి వచ్చింది.
Recommended Video

పండుగల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం
ఇక రానున్న రోజులన్నీ పండుగ రోజులని ఈ సమయంలో అందరూ కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలి. మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని రక్షిత వలయంలో ఉండేలా చూసుకోవాలని భారత ప్రధాని మోడీ కోరారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరికి కీలక పాత్ర ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో పండుగలు జరుపుకుంటూనే కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
-
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
విస్తరిస్తున్న డేంజరస్ వైరస్.. వ్యాక్సిన్ లేదు.. లక్షణాలు ఇవే.. -
నల్ల బంగారం, ప్రపంచంలోనే కాస్ట్లీ కలప ఇదే! కిలో ఎన్ని లక్షలు? -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..!












Click it and Unblock the Notifications