వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వేళ బీజేపీకి భారీగా విరాళాలు..ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

|
Google Oneindia TeluguNews

రాజకీయ పార్టీలకు వివిధ సంస్థలు, లేదా వివిధ వ్యక్తులు విరాళాలు ఇవ్వడం సహజమే. అయితే కొన్ని సంస్థలు భారీ మొత్తంలో విరాళాలు ఇస్తున్నాయి. ఆ విరాళాలను చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. తాజాగా భారతీయ జనతాపార్టీకి భారీ మొత్తంలో విరాళం వచ్చినట్లు ప్రముఖ ఎన్నికల విరాళాల నిర్వహణ సంస్థ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ తన నివేదికలో పేర్కొంది.

బీజేపీకి రూ.144 కోట్లు విరాళం

బీజేపీకి రూ.144 కోట్లు విరాళం

దేశంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. అన్ని కార్యక్రమాలను చక్కబెట్టేందకు పార్టీలకు కావాల్సిన డబ్బులు కూడా విరాళాల రూపంలో ఆయా పార్టీల ఖజానాల్లోకి పొర్లుతున్నాయి. తాజాగా ప్రూడెంట్ ఎలక్టరోల్ ట్రస్ట్ అనే సంస్థ భారతీయ జనతాపార్టీకి రూ.144 కోట్లు విరాళం ఇచ్చినట్లు తన నివేదికలో పొందుపర్చింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సంస్థకు వివిధ సంస్థల నుంచి వచ్చిన రూ. 169 కోట్లలో రూ.144 కోట్లు ఒక్క బీజేపీ పార్టీకే వచ్చినట్లు పేర్కొంది.

 రూ.52 కోట్లతో తొలిస్థానంలో నిలిచిన డీఎల్ఎఫ్ సంస్థ

రూ.52 కోట్లతో తొలిస్థానంలో నిలిచిన డీఎల్ఎఫ్ సంస్థ

ప్రూడెంట్ ఎలక్టరోల్ ట్రస్ట్‌కు అత్యధికంగా విరాళం ఇచ్చిన వాటిలో డీఎల్ఎఫ్ సంస్థ తొలి స్థానంలో నిలిచింది. మొత్తం రూ.52 కోట్లు విరాళంగా ఇచ్చి తొలిస్థానంలో నిలిచింది డీఎల్ఎఫ్ సంస్థ. దీని తర్వాత రెండో స్థానంలో రూ.33 కోట్లతో భారతీ గ్రూప్ నిలువగా... యూపీఎల్ రూ.22 కోట్లు, గుజరాత్‌కు చెందిన టొరెంట్ గ్రూప్ రూ.20 కోట్లు విరాళంగా ప్రూడెంట్ సంస్థకు ఇచ్చాయి. ఇక డీసీఎం శ్రీరామ్ సంస్థ రూ.13 కోట్లు ఇవ్వగా... క్యాడిలా గ్రూపు రూ.10 కోట్ల హల్దియా ఎనర్జీ సంస్థ రూ.8 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ప్రూడెంట్ సంస్థ తన నివేదికలో తెలిపింది. రూ. 10 కోట్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్లగా... మరో రూ. 5 కోట్లు ఒడిషా బిజూ జనతాదల్ పార్టీకి విరాళం రూపంలో వచ్చినట్లు నివేదికలో పేర్కొంది.

90 శాతం కార్పోరేట్ సంస్థల విరాళాలు బీజేపీకే

90 శాతం కార్పోరేట్ సంస్థల విరాళాలు బీజేపీకే


గత నాలుగేళ్లలో 90శాతం కార్పోరేట్ సంస్థలు తమ విరాళాలన్నీ ప్రూడెంట్ సంస్థకే ఇచ్చాయి. ఇదిలా ఉంటే ఇకపై బాండ్ల రూపంలో విరాళాలు ఇస్తుండటంతో ట్రస్టులు మెల్లగా కనుమరుగవుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి 18 కంతుల్లో రూ. 144 కోట్లు వచ్చాయి. 2017లో కాంగ్రెస్‌కు నాలుగు చెక్ పేమెంట్లు వచ్చాయి. బీజేడీకి మూడు చెక్కులు 2017 జనవరి 2018కి వచ్చాయి.

 2014 నుంచి 2017 వరకు రాజకీయ పార్టీలకు విరాళంగా రూ.637.54 కోట్లు

2014 నుంచి 2017 వరకు రాజకీయ పార్టీలకు విరాళంగా రూ.637.54 కోట్లు


డీఎల్ఎఫ్, భారతీ, టొరెంట్, యూపీఎల్ సంస్థలు ప్రుడెంట్ ట్రస్టుకు గత నాలుగేళ్లుగా విరాళాలు ఇస్తున్నాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ.41 .37 కోట్లు , 2015లో రూ. 106 కోట్లు, 2016లో రూ. 45 కోట్లు మేరా బీజేపీకి విరాళం ఇచ్చింది ప్రుడెంట్ సంస్థ. అప్పటికి ఈ సంస్థ పేరు సత్య ఎలక్టోరోల్ ట్రస్ట్‌గా ఉన్నింది. 2017లో ప్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్ట్‌గా పేరు మార్చుకున్నాక వచ్చిన రూ. 283.73కోట్లలో రూ.252.22 కోట్లు బీజేపీకి ఇవ్వగా కాంగ్రెస్‌కు రూ. 14 కోట్లు ఇచ్చింది. ఇక గణాంకాలను పరిశీలిస్తే రాజకీయపార్టీలకు విరాళాలు ఇచ్చేవారి వివరాలు బహిర్గతం చేయాలంటూ చెబుతూ పారదర్శకత కోసం 2014లో కొన్ని గైడ్‌లైన్స్ తప్పని సరి అయ్యాయి. అంతకుముందు దేశంలోని ఆరు ఎన్నికల విరాళాల నిర్వహణ సంస్థలు వివిధ రాజకీయపార్టీలకు 2005 నుంచి 2012 వరకు 105 కోట్లు ఇచ్చాయి. ఇక 2014 నుంచి 2017 వరకు రిజిస్టర్ అయిన 9 ఎలక్టోరల్ ట్రస్టులు రూ.637.54 కోట్లు విరాళంగా ఆయా రాజకీయ పార్టీలకు ఇచ్చాయి.

English summary
The Bharatiya Janata Party was the biggest beneficiary of the electoral trust that raises the most money from the industry for political contributions, in fiscal 2017-18.Prudent Electoral Trust gave almost all the money it generated - Rs 144 crore of Rs 169 crore - to the ruling party, according to the trust’s contribution report for the year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X