వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంటిదీ బ్లింకిట్: జిరాక్స్‌కు రూ.9..? సర్వీస్ చార్జీ అదనం

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు అంతా ఆన్ లైన్.. అవును చివరికీ ప్రింటవుట్ కూడా అందజేస్తున్నారు. గ్రోసరీ, గూడ్స్ డెలివరీ యాప్ బ్లింకిట్ ప్రింటవుట్ సర్వీస్ ప్రారంభించింది. ఇప్పుడు గురుగ్రామ్‌లో అందుబాటులో ఉంది. కానీ ధర మాత్రం మాములుగా లేదు. అవును రోడ్డు మీద కాపీకి రూ.2 ఉంటే.. బ్లింకిట్‌లో మాత్రం అడ్డగోలుగా వసూల్ చేస్తున్నారు.

ప్రింట్‌కు రూ.9

ప్రింట్‌కు రూ.9

ఒక్కో ప్రింటవుట్‌కు 2 రూపాయలు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండటం రేర్.. బ్లింకిట్ మాత్రం ఒక పేజీకి ఏకంగా రూ. 9, కలర్‌ ప్రింట్‌కు అయితే రూ. 19గా ముక్కిపిండీ మరీ వసూల్ చేస్తోంది. ప్రతి ప్రింటింగ్ ఆర్డర్‌కు డెలివరీ చార్జీ కూడా వేస్తోంది. అదీ రూ రూ. 25 వసూలు చేస్తోంది. అంటే ఓ మూడు పేజీలు జిరాక్స్ తీసుకోవాలంటే.. రూ.27 కాపీలకు.. మరో రూ.25 సర్వీస్ ఛార్జీ వసూల్ చేస్తారు. అంటే రూ.52 రూపాయాలు అన్నట్టు.. దాని కన్నా బోలెడు వైట్ పేపర్లు వస్తాయని.. బయట తీస్తే 25 కాపీల వరకు రావొచ్చు అని అంటున్నారు.

సర్వీస్ ఛార్జీ అదనం..

సర్వీస్ ఛార్జీ అదనం..


స్కూల్, కాలేజీ సమయాల్లో వీధుల్లో జిరాక్స్ సెంటర్‌లో జిరాక్స్ తీయించుకున్న వారిని బ్లింకిట్ చార్జీలు షాక్‌నకు గురిచేస్తాయి. చార్జీలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు విరుచుకుపడుతుంటే.. మరికొందరు మాత్రం స్వాగతిస్తున్నారు. రెండు వైపులా ప్రింటింగ్‌కు స్థానికంగా ఉండే జిరాక్స్ సెంటర్లు రెండు మూడు రూపాయలు వసూలు చేస్తున్నాయని, బ్లింకిట్ చార్జీలు దారుణంగా ఉన్నాయని అంటున్నారు. అధిక ధర వల్ల ఈ సర్వీసు సక్సెస్ కాబోదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

లాండ్రీ చవక

లాండ్రీ చవక

దీనిని సర్వీస్ అంటారా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీని కంటే లాండ్రీ చాలా చవక అని చెబుతున్నారు. నిజమే.. మెట్రో నగరాల్లో ఒక్కో షర్ట్, లేదంటే ప్యాంట్ చక్కగా ఇస్త్రీ చేసి ఇస్తున్నారు. దానికన్నా దారుణంగా జిరాక్స్ సర్వీస్ ఉంది. 11 నిమిషాల్లో ప్రింటవుట్లను డెలివరీ చేస్తామని బ్లింకిట్ చెబుతోంది.. అత్యవసరం అయిన వారికి ఇది చాలా చవకైన మార్గం అని మరికొందరు అంటున్నారు. కానీ ధర మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అవును నిజమే.. ఎంత త్వరగా డెలివరీ చేస్తారెమో కానీ.. ఛార్జీ మాత్రం ఎక్కువే.. దానికి సర్వీస్ ఛార్జీ వసూల్ చేయడం దారుణం అని అంటున్నారు.

English summary
Blinkit is offering printouts for rs 9 per page. plus delivery charges is added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X