Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vande Mataram: వందేమాతరం గీతంపై కేంద్రం కీలక నిర్ణయం..!

ఒకప్పుడు బ్రిటీష్ పాలనలో ఉన్న భారతీయుల్ని వారికి వ్యతిరేకంగా ఏకం చేసిన వాటిలో వందేమాతర గీతం కూడా ఒకటి. బంకిచంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం అప్పట్లో భారతీయుల్ని ఉర్రూతలూగించింది. అయితే ఈ గీతంలో హిందూ దేవతల్ని కీర్తిస్తూ ఉన్న చరణాలపై స్వాతంత్రం వచ్చాక అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అప్పట్లో నెహ్రూ సర్కార్ దీన్ని కుదించింది. దేశవాసులంతా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా దీన్ని పాడుకునేందుకు వీలుగా అప్పట్లో ఈ మార్పు చేసింది.

ఆ తర్వాత 2012లో కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా దీనిపై పార్లమెంట్ లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి మన్మోహన్ సింగ్ సర్కార్ రాజ్యసభలో అభ్యంతరకర వ్యాఖ్యల జాబితాలో వందేమాతరాన్ని కూడా చేర్చింది. దీంతో రాజ్యసభలో వందే మాతరం గీతం ఆలపించడానికి లేకుండా పోయింది. ఇప్పుడు దాన్ని సవరించి పార్లమెంట్ లో వందేమాతర గీతం ఆలపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు అనుగుణంలో చట్టంలో సవరణలు చేయనున్నారు.

Centre to Announce Key Decision on Vande Mataram in Parliament winter session

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం ఏకమై చేసిన పోరాటాన్ని ప్రతిబింబించే జాతీయ గీతం వందేమాతరం, ఇప్పుడు ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య పోరాటానికి కేంద్రబిందువుగా మారింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఎంపీలకు మర్యాద పాటించాలని, కొన్ని చేయవలసినవి, చేయకూడనివి పాటించాలని గుర్తు చేస్తూ ప్రభుత్వం ఒక మెమోరాండంను తిరిగి జారీ చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.

Centre to Announce Key Decision on Vande Mataram in Parliament winter session

పార్లమెంటు బులెటిన్ ప్రకారం సభా మర్యాద, కార్యకలాపాల తీవ్రత దృష్ట్యా థ్యాంక్స్, థ్యాంక్ యూ, జై హింద్, వందేమాతరం లేదా సభలో లేవనెత్తిన మరే ఇతర నినాదాలు చేయకూడదని పేర్కొన్నారు. దీంతో వందేమాతరం పదం ఎందుకు వాడకూడదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వందేమాతరాన్ని నిషేధిత పదాల జాబితా నుంచి తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంట్ లో జరిగే స్వల్పకాలిక చర్చ తర్వాత దీన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీలందరూ కచ్చితంగా సభకు రావాలని బీజేపీ ఆదేశాలు ఇస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+