గురుగ్రామ్ స్కూల్‌లో ఘోరం: రక్తపు మడుగులో విద్యార్థి

Subscribe to Oneindia Telugu

గురుగ్రామ్‌: దేశ రాజధాని న్యూఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేటు పాఠశాలలోని టాయిలెట్‌లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల విద్యార్థి మృతదేహం లభించింది. రక్తపుమడుగులో ఆ విద్యార్థి మృతదేహం పడి ఉండటం గమనార్హం.

ఈ దారుణ ఘటన స్థానిక ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని టాయిలెట్‌లో తోటి విద్యార్థి గుర్తించి పాఠశాల సిబ్బందికి తెలియజేశాడు. బాలుడి గొంతు కత్తితో నరికి ఉండటం గమనార్హం. మృతదేహం పక్కనే కత్తి కూడా లభించింది.

Class II student found dead in Gurugram's private school

పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఎవరో దారుణంగా హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గత సంవత్సరం కూడా ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వసంత్‌కుంజ్‌ బ్రాంచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. 6ఏళ్ల విద్యార్థి మృతదేహం వాటర్ ట్యాంకులో లభించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, a body of a class II student was found inside a toilet in Ryan International School in Gurugram.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X