వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా నాల్గవవేవ్ ఆందోళన: ముంబైలో కరోనాకేసుల్లో భారీ జంప్.. కానీ రిలీఫ్ ఏంటంటే!!

|
Google Oneindia TeluguNews

దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు నాలుగవ వేవ్ వస్తుందా అన్న అనుమానాలకు కారణం గా మారాయి. మహారాష్ట్రలో సోమవారం 1,036 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం కొత్త కేసుల వారానికి సగటున 1,000 కేసుల మార్కును దాటింది. ఫిబ్రవరి 26 నుండి కొత్త కేసుల ఏడు రోజుల సగటు ఇదే అత్యధికం.

మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదల.. రివ్యూ నిర్వహించిన సర్కార్

మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదల.. రివ్యూ నిర్వహించిన సర్కార్

రాష్ట్రంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదలను సమీక్షించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా కొత్త ఆంక్షలు లేదా తప్పనిసరి మాస్కులు ధరించే నియమాన్ని పునరుద్ధరించే ముందు పరిస్థితిని మరింతగా గమనించాలని నిర్ణయించుకుంది. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య ఇంకా గణనీయమైన పెరుగుదలకు దారితీసినట్లు లేదు. అయితే సగటు పరీక్ష సానుకూలత రేటు 4.25% వద్ద ఉంది.

ఓమిక్రాన్ సబ్ వేరియంట్ ల వల్ల కరోనా కేసుల పెరుగుదల, తీవ్రత తక్కువే

ఓమిక్రాన్ సబ్ వేరియంట్ ల వల్ల కరోనా కేసుల పెరుగుదల, తీవ్రత తక్కువే

ఒమిక్రాన్ వేరియంట్ యొక్క BA.4 మరియు BA.5 సబ్- వేరియంట్ ల ద్వారా ఈ పెరుగుదల కనిపిస్తుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో చాలా ఇన్ఫెక్షన్‌లు ఓమిక్రాన్ వేరియంట్ యొక్క BA.4 మరియు BA.5 వేరియంట్ల వల్లనే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి అని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌తో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం తరువాత ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే అన్నారు. రాష్ట్రంలో మరియు ముంబైలో ఆసుపత్రిలో చేరే రేటు తక్కువగానే కొనసాగుతోందని మంత్రి రాజేష్ తోపే చెప్పారు. రాష్ట్రంలోని ఆసుపత్రులలో కేవలం 1% పాజిటివ్ కేసులు మాత్రమే చేరుతున్నాయి. కాబట్టి, తీవ్రత తక్కువగా ఉంది మరియు అందువల్ల ఇది ఆందోళన కలిగించే ప్రధాన కారణం కాదు, అని మంత్రి పేర్కొన్నారు.

నాల్గవ వేవ్ ఆందోళన... ఇప్పుడే చెప్పలేం అంటున్న సర్కార్

నాల్గవ వేవ్ ఆందోళన... ఇప్పుడే చెప్పలేం అంటున్న సర్కార్

ముంబైలోని ఆస్పత్రిలో ఉన్న 24,579 పడకలలో సోమవారం 0.74% (185) మాత్రమే ఇప్పటివరకు ఫీల్ అయ్యాయని . 4,768 ఆక్సిజన్ బెడ్‌లలో 0.29% (14) మాత్రమే వినియోగించ బడ్డాయి అని తెలిపారు. తోపే రాష్ట్ర మంత్రివర్గానికి క్షేత్రస్థాయి పరిస్థితులపై వివరణాత్మక విశ్లేషణను అందించారు. గత ఏడు రోజుల్లో, రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 67.28% ముంబైలో నమోదయ్యాయి. తర్వాత థానే (17.17%), పూణే (7.42%), రాయ్‌గఢ్ (3.36%) మరియు పాల్ఘర్ (2%) ఉన్నట్టుగా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నాల్గవ వేవ్ ఆందోళన కనిపిస్తుంది, అధికారికంగా దీనిని నాల్గవ వేవ్ అని పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సుముఖంగా లేదని చెప్పారు.

ముంబైకి చెందిన చాలా మండి ప్రముఖులకు కరోనా.. అలెర్ట్ అంటున్న సర్కార్

ముంబైకి చెందిన చాలా మండి ప్రముఖులకు కరోనా.. అలెర్ట్ అంటున్న సర్కార్


గత వారంలో అనేక మంది ప్రముఖులు కోవిడ్ పాజిటివ్‌గా మారినట్లు నివేదించారు. షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్ తారలు, అలాగే ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ వంటి రాజకీయ నాయకులు ఆదివారం ట్విట్టర్‌లోకి వెళ్లి తాము కరోనా బారిన పడినట్టు ప్రకటించారు. కోవిడ్ -19 మహమ్మారి యొక్క నాల్గవ తరంగాన్ని రాష్ట్రం చూడగలదని, కోవిడ్ -19 సంబంధిత మరణాలు లేవని రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే ఆదివారం నాడు, రాష్ట్రం సంఖ్యల పెరుగుదలను తీవ్రంగా పరిగణిస్తోందని సూచించారు.బయటకు అడుగు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని , టీకా యొక్క బూస్టర్ డోస్ సకాలంలో అందుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే అన్నారు.

English summary
The corona fourth wave tension continues in Mumbai. A huge jump is seen in corona cases. But the severity low in the cases seems to be a relief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X