వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సెకండ్ వేవ్ ను ఆపాలి , సత్వర నిర్ణయాలు తీసుకోకుంటే కరోనా కంట్రోల్ కష్టం : సీఎంలతో పీఎం మోడీ

|
Google Oneindia TeluguNews

మళ్లీ ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కంట్రోల్ తప్పిపోయింది. ఇక ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారు.

సీఎం లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ... కరోనా పరిస్థితిపై సమీక్ష

సీఎం లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ... కరోనా పరిస్థితిపై సమీక్ష

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందని, సమర్థంగా ఎదుర్కోడానికి అన్ని రాష్ట్రాలు నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులతో పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ భారత్ లో తాజాగా కరోనా పరిస్థితి, వైరస్ నియంత్రణ, వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

 కేసులు పెరుగుతున్న క్రమంలో అలెర్ట్ అయిన కేంద్రం

కేసులు పెరుగుతున్న క్రమంలో అలెర్ట్ అయిన కేంద్రం

దేశంలో గత కొంతకాలంగా రోజువారి కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో దారుణమైన కరోనా పరిస్థితులు, మరోమారు భారత్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో వర్చువల్ విధానంలో సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

నేడు భారతదేశంలో 96% కంటే ఎక్కువ కేసులు కరోనా నుండి కోలుకున్నారని పేర్కొన్నారు.

కరోనాను నియంత్రించగలమని అతి విశ్వాసం వద్దు .. అప్రమత్తత అవసరం

కరోనాను నియంత్రించగలమని అతి విశ్వాసం వద్దు .. అప్రమత్తత అవసరం

మరణాల రేటు అత్యల్పంగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటని ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో అన్నారు.కోవిడ్ -19 వ్యాప్తికి వ్యతిరేకంగా త్వరితగతిన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. కరోనా సెకండ్ వేవ్ ను వెంటనే ఆపాలని అన్నారు. కరోనాను నియంత్రించగలమని అతి విశ్వాసం మంచిది కాదన్నారు. గత కొన్ని వారాలుగా దేశంలోని 70 జిల్లాల్లో కేసుల సంఖ్య 150 శాతానికి పైగా పెరిగిందని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయా రాష్ట్రాల సీఎంలతో పిఎం మోడీ అన్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా వ్యాప్తి లేని రాష్ట్రాలలో కూడా కేసులు పెరిగే అవకాశం

పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా వ్యాప్తి లేని రాష్ట్రాలలో కూడా కేసులు పెరిగే అవకాశం

ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా వ్యాప్తి లేని రాష్ట్రాలలో కూడా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు . మరోమారు దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందే పరిస్థితి రావచ్చు అని ప్రధాని చెప్పారు. చిన్న చిన్న నగరాల్లో సైతం కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని, వైద్య సదుపాయాల విషయంలో కూడా అలెర్ట్ గా ఉండాలని సూచించారు.

వ్యాక్సినేషన్ చేసిన తర్వాత వ్యర్ధాల విషయంలో జాగ్రత్త వహించాలని మోడీ ముఖ్యమంత్రులకు సూచించారు .

మహారాష్ట్రలో కరోనా బీభత్సం .. తాజా కేసులు 16,620 , ఈ ఏడాది రోజువారీ కేసులలో అత్యధికం ఇదేమహారాష్ట్రలో కరోనా బీభత్సం .. తాజా కేసులు 16,620 , ఈ ఏడాది రోజువారీ కేసులలో అత్యధికం ఇదే

English summary
Urging all states and Union territories to take quick and decisive steps against the spread of Covid-19, Prime Minister Narendra Modi on Wednesday said the second wave of Corona has to be stopped immediately. Sounding an alert to the states, PM Modi said that 70 districts of the country have seen an increase of more than 150 per cent in number of cases in the last few weeks. If the outbreak can’t be contained now, a situation of nationwide outbreak can come up, the PM said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X