షాక్: విజయకాంత్ దంపతులపై అరెస్టు వారంట్

Posted By:
Subscribe to Oneindia Telugu

కోయంబత్తూర్: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. పలుమార్లు కోర్టుకు గైర్హాజరవుతూ నిర్లక్ష్యం వహించినందున తిరుపూర్ దగ్గర్లోని జిల్లాకోర్టు ప్రధాన న్యాయమూర్తి నటరాజన్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

విజయకాంత్‌తో పాటు, ఆయన సతీమణి ప్రేమలతపై కూడా వారెంట్ జారీ అయ్యింది. పరువు నష్టం కేసుకు సంబంధించి మూడు సార్లు విజయకాంత్ దంపతులు విచారణకు హాజరుకాలేదు. తాజాగా మంగళవారం నాలుగోసారి కూడా నిర్లక్ష్యం చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

 Court issuesarrest warrant against Vijayakanth couple

గతంలో 2015 నవంబరు 6న పల్లాడంలో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి జయలలితపై ఆయన చేసిన వ్యాఖ్యలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ఎన్. సుబ్రహ్మణ్యం గతంలో విజయకాంత్ దంపతులపై ఫిర్యాదు చేశారు. పల్లదమ్‌లో ఈ ఏడాది నవంబర్ 6వ తేదీన జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.

గత శాసనసభ ఎన్నికల్లో విజయ్ కాంత్ పార్టీ డిఎండికె ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. విజయ్ కాంత్ కూడా ఓడిపోవడమే కాకుండా డిపాజిట్ కూడా కోల్పోయారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A court in nearby Tirupur today issued arrest warrants against DMDK leader Vijayakanth and his wife Premalatha after they repeatedly failed to appear before it in a defamation case filed against them.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి