తరుముకొస్తున్న గులాబ్ తుపాన్-ఒడిశాలో భారీ వర్షాలు-ఉత్తరాంధ్రలోనూ-నేవీ అప్రమత్తం
ఏపీ-ఒడిశా రాష్ట్రాలపై గులాబ్ తుపాను ప్రభావం తీవ్రమవుతోంది. ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా జిల్లాలపై ఇది ప్రభావం చూపుతోంది. ఈ అర్ధరాత్రికి గోపాల్ పూర్-కళింగపట్నం మధ్య గులాబ్ తుపాను తీరం దాటబోతోంది. దీంతో ఇప్పటికే ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో వర్షాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లో వర్షాలు తీవ్రరూపం దాల్చబోతున్నాయి. ఇరు రాష్ట్రాల అధికారులు తీర ప్రాంతాల్ని అప్రమత్తం చేస్తున్నారు.
గులాబ్ తుపాను ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపైనా, ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలపైనా ప్రభావం చూపుతుందని జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) అంచనా వేస్తోంది. గులాబ్ తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలతో పోలిస్తే ఒడిశాపైనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒడిశాలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులాబ్' తుఫాను నేపథ్యంలో ఒడిశాలోని దక్షిణ, తీరప్రాంతాలలో ఇవాళ ఉదయం నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి, ఇది గత నాలుగు నెలల్లో రాష్ట్రంలో రెండో తుపాను. ప్రస్తుతం ఇది గోపాల్‌పూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 140 కిమీ, కళింగపట్నానికి తూర్పు-ఈశాన్యంలో 190 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావారణ శాఖ వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను 'గులాబ్' అర్ధరాత్రి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం మధ్య తీరాన్ని తాకుతుందని భావిస్తున్నందున, భారత నావికాదళం తుఫాను కదలికను నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధాన కార్యాలయం, తూర్పు నౌకాదళం, ఒడిశా ప్రాంతంలోని నేవల్ ఆఫీసర్స్-ఇన్-ఛార్జ్ తుఫాను ప్రభావాలను ఎదుర్కోవడానికి సన్నాహక కార్యకలాపాలను నిర్వహించాయి. తుపాను నేపథ్యంలో ఏపీ, ఒడిశా ప్రభుత్వాలకు సాయం చేసేందుకు అధికారులతో నేవీ వర్గాలు టచ్ లో ఉన్నాయి. అటు ప్రధాని మోడీ కూడా ఏపీ, ఒడిశా సీఎంలు జగన్, నవీన్ పట్నాయక్ తో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

గులాబ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సోమవారం ఉదయం వరకు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం వరకు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరంలోని చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications